
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని పొన్నప్ప ఓ ఇంటివారయ్యారు. వ్యాపారవేత్త, మోడల్ అయిన కరన్ మేడప్పతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్‌లో అశ్విని, మేడప్పలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అశ్విని వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత అక్టోబర్ 30న కరన్ మేడప్పతో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని బ్యాడ్మింటన్ ప్లేయర్ అశ్విని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత్ తరఫున పలు అంతర్జాతీయ టోర్నీల్లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఆమె పతకాలు సాధించిన విషయం తెలిసిందే.