పోరాడి ఓడిన పీవీ సింధు | Sindhu and Jwala-Ashwini lose, settle for bronze | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన పీవీ సింధు

Published Sat, Apr 26 2014 1:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

పోరాడి ఓడిన పీవీ సింధు

పోరాడి ఓడిన పీవీ సింధు

ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్లో భారత పోరు ముగిసింది.

ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్లో భారత పోరు ముగిసింది. సింగిల్స్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్ప కూడా చైనా క్రీడాకారిణులతో జరిగిన సెమీస్లో ఓడిపోయారు. దీంతో 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న ఈ టోర్నమెంటులో్ కాంస్యపతకాలతోనే వారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటా 18 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మారథాన్ మ్యాచ్లో వరల్డ్ నెం.2 క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో పీవీ సింధు పోరాడి ఓడింది.

తొలి గేమ్ను సింధు 21-15 స్కోరుతో గెలుచుకుని ఆశలు రేకెత్తించింది. అయితే, రెండో గేమ్ను షిసియాన్ 22-20తో గెలుచుకుంది. మూడో గేమ్లో షిసియాన్ పూర్తి ఆధిక్యం కనబరిచింది. 21-12 తేడాతో సింధును ఓడించింది. వీళ్లిద్దరు ఇప్పటికి ఐదుసార్లు ముఖాముఖి తలపడగా సింధు మూడుసార్లు, షిసియాన్ రెండు సార్లు గెలిచారు. ఇక డబుల్స్ మ్యాచ్ మాత్రం కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిపోయింది. లూ యింగ్, లూ యు జోడీ చేతిలో జ్వాల - అశ్విని జోడీ 21-12, 21-7 తేడాతో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement