జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్ | Jwala-Ashwini pair wins Canada Open | Sakshi
Sakshi News home page

జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్

Published Mon, Jun 29 2015 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్

జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్

కల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత మహిళలు సత్తా చాటారు. గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ మహిళ డబుల్  టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో డచ్ కు చెందిన టాప్ క్రీడాకారిణులను వరుస సెట్లలో ఓడించి టైటిల్ గెల్చుకున్నారు.

తుదిపోరులో ఈఫజీ మస్కన్స్, సెలెనా పీక్ జంటను 21-19 21-16 తేడాతో ఓడించింది. 35 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించడం విశేషం. 2012 ఒలింపిక్స్ తర్వాత మళ్లీ జతకట్టిన జ్వాల, అశ్విని సాధించిన తొలి టైటిల్ ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement