Canada Open Badminton
-
PV Sindhu: సింధు శుభారంభం
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21–16, 21–9తో తాలియా ఎన్జీ (కెనడా)పై విజయం సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 12–21, 3–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. లక్ష్య సేన్ 21–18, 21–15తో రెండో సీడ్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించగా... సాయిప్రణీత్ 12–21, 17–21తో వైగోర్ కొల్హో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. మనిక ముందంజ లుబ్లియానా (స్లొవేనియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ లుబ్లియానా టోరీ్న లో భారత నంబర్‌వన్ మనిక బత్రా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక 11–4, 11–9, 11–7తో ప్రపంచ 15వ ర్యాంకర్ చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 9–11, 8–11, 11–9, 9–11తో భారత సంతతికి చెందిన ఫ్రాన్స్ క్రీడాకారిణి ప్రీతిక చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో జయరాం, ప్రణయ్
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్‌లతో పాటు టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లంతా మూడో రౌండ్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 17-21, 21-17, 21-13తో మార్టిన్ గిఫ్రే (కెనడా)పై నెగ్గాడు. రెండో సీడ్ ప్రణయ్ 13-21, 21-11, 21-15తో మట్టియాస్ బోర్గ్ (స్వీడన్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-8, 21-6తో జొనాథన్ లాయ్ (కెనడా)పై, సాయి ప్రణీత్ 26-24, 21-16తో కన్ చావో యు (చైనీస్ తైపీ)పై, ప్రతుల్ జోషి 21-13, 21-12 అలిస్టర్ కేసేపై నెగ్గారు. మహిళల విభాగంలో రుత్విక శివాని 21-14, 21-14తో కైలీగ్ (కెనడా)పై, తన్వీ లాడ్ 21-17, 21-10తో జూలీ ఫిన్నేపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి, అశ్విని పొన్నప్ప జంట 21-13, 21-14తో బైరాన్ హోల్సెక్, ఎరిన్లపై విజయం సాధించింది. -
జ్వాల, అశ్విని జోడీకి కెనడా టైటిల్
కల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత మహిళలు సత్తా చాటారు. గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ మహిళ డబుల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో డచ్ కు చెందిన టాప్ క్రీడాకారిణులను వరుస సెట్లలో ఓడించి టైటిల్ గెల్చుకున్నారు. తుదిపోరులో ఈఫజీ మస్కన్స్, సెలెనా పీక్ జంటను 21-19 21-16 తేడాతో ఓడించింది. 35 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించడం విశేషం. 2012 ఒలింపిక్స్ తర్వాత మళ్లీ జతకట్టిన జ్వాల, అశ్విని సాధించిన తొలి టైటిల్ ఇది. -
సెమీస్‌లో గుత్తా జ్వాల జోడీ
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ గుత్తా జ్వాల జోడీ ముందంజ వేసింది. సెమీఫైనల్ చేరుకుంది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జంట సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో జ్వాల, అశ్విని 21-19 21-13 హాంకాంగ్ ద్వయం చన్ కక, యున్ సిన్పై విజయం సాధించారు. సెమీస్‌లో భారత్ జోడీ జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటొతో తలపడనుంది. కాగా ఇతర భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, అజయ్ జయరామ్, మహిళల డబుల్స్‌లో ప్రద్న్య గాడ్రె, సిక్కిరెడ్డి జోడీ ఓటమి చవిచూశారు.