ప్రిక్వార్టర్స్‌లో జయరాం, ప్రణయ్ | Indian shuttlers sail into Canada Open pre quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో జయరాం, ప్రణయ్

Published Fri, Jul 1 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

Indian shuttlers sail into Canada Open pre quarters

కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లతో పాటు టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లంతా మూడో రౌండ్‌లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 17-21, 21-17, 21-13తో మార్టిన్ గిఫ్రే (కెనడా)పై నెగ్గాడు. రెండో సీడ్ ప్రణయ్ 13-21, 21-11, 21-15తో మట్టియాస్ బోర్గ్ (స్వీడన్)పై గెలిచాడు.

మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-8, 21-6తో జొనాథన్ లాయ్ (కెనడా)పై, సాయి ప్రణీత్ 26-24, 21-16తో కన్ చావో యు (చైనీస్ తైపీ)పై, ప్రతుల్ జోషి 21-13, 21-12 అలిస్టర్ కేసేపై నెగ్గారు. మహిళల విభాగంలో రుత్విక శివాని 21-14, 21-14తో కైలీగ్ (కెనడా)పై, తన్వీ లాడ్ 21-17, 21-10తో జూలీ ఫిన్నేపై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మను అత్రి, అశ్విని పొన్నప్ప జంట 21-13, 21-14తో బైరాన్ హోల్‌సెక్, ఎరిన్‌లపై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement