కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ గుత్తా జ్వాల జోడీ ముందంజ వేసింది. సెమీఫైనల్ చేరుకుంది. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జంట సెమీఫైనల్కు చేరుకుంది.
క్వార్టర్స్లో జ్వాల, అశ్విని 21-19 21-13 హాంకాంగ్ ద్వయం చన్ కక, యున్ సిన్పై విజయం సాధించారు. సెమీస్లో భారత్ జోడీ జపాన్ క్రీడాకారిణులు షిహొ టనక, కొహరు యొనెమొటొతో తలపడనుంది. కాగా ఇతర భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, అజయ్ జయరామ్, మహిళల డబుల్స్లో ప్రద్న్య గాడ్రె, సిక్కిరెడ్డి జోడీ ఓటమి చవిచూశారు.
సెమీస్లో గుత్తా జ్వాల జోడీ
Published Sat, Jun 27 2015 11:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement