ఎవరైనా చనిపోతే ఏం చేస్తావ్‌? గుత్తా జ్వాల ఫైర్‌ | Badminton Player Jwala Gutta Fires on Samantha | Sakshi
Sakshi News home page

Samantha: నీ ట్రీట్‌మెంట్‌ వికటించి ఎవరైనా చనిపోతే బాధ్యత తీసుకుంటావా?

Published Sat, Jul 6 2024 6:51 PM | Last Updated on Sat, Jul 6 2024 7:17 PM

Badminton Player Jwala Gutta Fires on Samantha

మంచి చేయాలనుకుంటే తనకే చీవాట్లు పడుతున్నాయంటోంది హీరోయిన్‌ సమంత. అయితే సొంతంగా వైద్య సలహాలు ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు డాక్టర్స్‌. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు నెబులైజర్‌ ద్వారా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను పీల్చుకోవడం మంచిదని.. మందుల కంటే కూడా అద్భుతంగా పని చేస్తుందని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. తన పోస్ట్‌కు బలం చేకూర్చేలా.. ఈ చికిత్స మంచిదేనని ధ్రువీకరించిన డాక్టర్‌ను సైతం ట్యాగ్‌ చేసింది. 

ప్రమాదం
ఇకపోతే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అందరికీ పడదు. అలాంటిది నెబులైజర్‌ ద్వారా దాన్ని పీల్చుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది తెలుసుకోకుండా తనను ఫాలో అయ్యే మూడున్నర కోట్ల మందిని సమంత తప్పుదోవ పట్టించడం కరెక్ట్‌ కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల సైతం సామ్‌ను విమర్శించింది. 

మీ ఆలోచన మంచిదే!
'జనాలకు హెల్త్‌ టిప్స్‌ ఇస్తున్న సెలబ్రిటీలను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా మరణిస్తే పరిస్థితేంటి? ఎదుటివారికి సాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే ఏం చేస్తారు? దానికి మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?' అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. కరెక్ట్‌గా చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

చదవండి: అనంత్‌ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్‌ స్టార్‌.. వీడియో వైరల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement