Vishnu Vishal Son And Wife Attend Pooja For His Latest Film Aryan - Sakshi
Sakshi News home page

Vishnu Vishal : విష్ణు విశాల్‌ హీరోగా ఆర్యన్‌ సినిమా ప్రారంభం.. పూజలో పాల్గొన్న గుత్తాజ్వాల

Published Mon, Sep 5 2022 8:39 AM | Last Updated on Mon, Sep 5 2022 9:21 AM

Vishnu Vishal Son And Wife Attend Pooja For His Latest Film Aaryan - Sakshi

తమిళసినిమా: విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రానికి ఆర్యన్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే విష్ణు విశాల్‌ మరోసారి ఈ చిత్రం ద్వారా యాక్షన్‌ హీరోగా కనిపించబోతున్నారు. క్రైమ్, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటించనున్నారు. సుబ్రా, ఆర్యన్‌ రమేష్‌ల సమర్పణలో విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ చిత్ర షూటింగ్‌ శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ రాక్షసన్‌ చిత్రం తరువాత విష్ణు విశాల్‌ ఇందులో పోలీసు అధికారిక ఫవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్రం ఊహించని మలుపులతో పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. దీనికి విష్ణు సుభాష్‌ ఛాయాగ్రహణం, శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement