ప్రిక్వార్టర్స్‌లో జ్వాల జోడీ | jwala gutta | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో జ్వాల జోడీ

Published Thu, Feb 26 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

jwala gutta

న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని జోడీ 21-17, 21-16తో సుసీ రిజ్కీ అందిని-మరెతా గియోవాని (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
 
  పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ భట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో అరవింద్ 21-10, 24-22తో ప్యాట్రిక్ కెమ్‌నిట్జ్ (జర్మనీ)పై గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement