నేటి నుంచి థామస్-ఉబెర్ కప్
కున్‌షాన్ (చైనా): క్రితంసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు మరో పతకంపై దృష్టి పెట్టింది. ఆదివారం మొదలయ్యే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ థామస్ కప్, ఉబెర్ కప్‌లో భారత జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఉబెర్ కప్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలతో కూడిన భారత మహిళల జట్టు సోమవారం జరిగే గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో జపాన్, జర్మనీ జట్లు కూడా ఉన్నాయి.
మరోవైపు థామస్‌కప్‌లో అజయ్ జయరామ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సుమీత్ రెడ్డి, మనూ అత్రిలతో కూడిన పురుషుల జట్టు ఆదివారం జరిగే గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు ఇండోనేసియా, హాంకాంగ్ జట్లున్నాయి. లీగ్ దశ పోటీలు ముగిశాక నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి.
మరో పతకమే లక్ష్యంగా...
Published Sun, May 15 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement