జీవితకాల నిషేధం ప్రతిపాదనపై పోరాడుతున్న బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
బెంగళూరు: జీవితకాల నిషేధం ప్రతిపాదనపై పోరాడుతున్న బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ గుత్తా జ్వాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ‘బాయ్’ తీరు సరిగా లేదని విమర్శించారు.
వాళ్ల చర్యలను తన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని చెప్పారు. భారత్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగి అయిన జ్వాల... నిషేధం విషయంలో జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మొయిలీని కలిసి విజ్ఞప్తి చేసింది. ‘జ్వాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఓ ప్లేయర్‌గా ఆమెకు ఉన్న పేరు ప్రతిష్టలను బాయ్ తక్కువగా చూడొద్దు. నైపుణ్యం ఉన్న వారిని అణగదొక్కొద్దు’ అని మొయిలీ వ్యాఖ్యానించారు. టోర్నీల్లో ఆడకుండా జ్వాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.