హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొప్ప మనసు చాటుకుంది. భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడుకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. స్రవంతి తల్లిదండ్రలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.తన తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తండ్రి కూడా ఐసీయూలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడని స్రవంతి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ ఆమెకు తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సాయం చేసేందుకు ముందుకొచ్చిన హెచ్‌సీఏకు ఆమె థ్యాంక్స్ చెప్పింది.
తల్లిదండ్రుల చికిత్స కోసం స్రవంతి ఇప్పటికే రూ.16 లక్షలు ఖర్చు చేసిందని, ఆమెకు ఆర్థిక సాయం అవసరమని షట్లర్ గుత్తా జ్వాలా ట్వీట్ చేసింది. ఆమెను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పేషెంట్స్‌కు సాయం చేస్తున్న క్రికెటర్ హనుమ విహారి.. స్రవంతి కోసం తమవంతు సాయం చేస్తామని ట్వీట్ చేశాడు.
(చదవండి:టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment