కొరియా ఓపెన్
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి ఓటమిపాలైంది. రెండోరౌండ్‌లో యి నా జంగ్-సో యంగ్ కిమ్ (కొరియా) 21-18, 21-12తో జ్వాల ద్వయంపై గెలిచింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వాల జోడి స్థాయి మేరకు రాణించలేకపోయింది.
తొలి గేమ్‌లో ఓ దశలో 18-16 ఆధిక్యంలో ఉన్నా... కొరియా జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 5-5తో స్కోరు సమమైనా... ప్రత్యర్థి జోడి ధాటికి క్రమంగా వెనుకబడింది. స్కోరు 11-10 ఉన్న దశలో జంగ్-కిమ్ జోడి వరుసగా 8 పాయింట్లు సాధించింది. తర్వాత మరో రెండు పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో తరుణ్ కోనా-అశ్విని జంట 10-21, 15-21తో ఏడోసీడ్ మిచెల్ ఫుచ్స్-బిర్గిట్ మిచెల్స్ (జర్మనీ)ల చేతిలో ఓడింది.
జ్వాల జోడి ఓటమి
Published Fri, Jan 10 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement