విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ – ‘‘రవితేజ నాకు బ్రదర్‌లాంటివారు. మీరు (రవితేజ) హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘ఎఫ్‌ఐఆర్’ ఒకేసారి విడుదలవుతున్నాయని నేను అన్నప్పుడు ‘అయితే.. ఏంటి?’ అన్నట్లు ఆయన కూల్‌గా రిప్లై ఇచ్చారు. రవితేజగారు లేకపోయినట్లయితే తెలుగులో ‘ఎఫ్‌ఐఆర్’ రిలీజ్ సాధ్యమయ్యేది కాదు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్స్ కూడా చేస్తాను’’ అన్నారు.
‘‘విష్ణు విశాల్‌గారిని హీరోగా అనుకుని ఆయనకు ఈ కథ చెప్పాను. కానీ పరిస్థితుల కారణంగా హీరోగా నటించడంతో పాటు ఆయన నిర్మించాల్సి వచ్చింది కూడా. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమా అయింది’’ అన్నారు మను ఆనంద్. ‘‘ఎఫ్‌ఐఆర్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని విష్ణు విశాల్‌తో చెప్పాను. మాకు సపోర్ట్ చేసిన రవితేజకు ధన్యవాదాలు’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విష్ణు విశాల్ సతీమణి గుత్తా జ్వాల. ‘‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత నేను ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’’ అన్నారు మంజిమా మోహన్. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని ‘ఎఫ్‌ఐఆర్’ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment