bilingual movie
-
వృషభ.. మళ్లీ ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్!
మోహన్‌లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్‌లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్లో ఆ తరహా యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మా సినిమాకు వర్క్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
సీనియర్ నటుల నుంచి చాలా చేర్చుకున్నా: నాగచైతన్య
‘‘ఓ నటుడుగా నన్ను నేనెప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను... అభినందించుకోను. ఎప్పటికప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటాను.. నటుడిగా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► తమిళ చిత్రం ‘మానాడు’ విడుదల కాకముందే వెంకట్ ప్రభుగారు నాకు ‘కస్టడీ’ స్టోరీ చెప్పారు. అయితే ‘మానాడు’ విడుదలై, హిట్ సాధించిన తర్వాత, ఈ సినిమానే మేం తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. కానీ ‘కస్టడీ’ స్టోరీ నన్ను ఎగ్జయిట్ చేసింది. పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంతవరకు పూర్తయింది. దీంతో ‘కస్టడీ’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. ఈ సినిమాలో భాగంగా కొందరు పోలీసులను కలిశాను. వారి కథలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ► ఈ సినిమాలో నేను పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్ర చేశాను. నా కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొన్ని కొత్త యాక్షన్ సీక్వెన్స్‌లను ఈ సినిమా కోసం చేశాం. కథ రీత్యా ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్‌లు అవసరం అయ్యాయి. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కొంత రిహార్సల్స్ చేశాం. ఈ సినిమాలోని వాటర్ సీక్వెన్స్ కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేసి, దాదాపు 15 రోజులు షూట్ చేశాం. ఈ ఎపిసోడ్ ఓ హైలైట్‌గా ఉంటుంది. ► సినిమా మొదలైన తొలి ఇరవై నిమిషాలు కూల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్‌పైకి అరవింద్ స్వామిగారు వస్తారో అప్పట్నుంచి స్టోరీ మలుపు తీసుకుని ఆడియన్స్‌ను స్క్రీన్‌పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి వంటి సీనియర్స్ నటించారు. వారి నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇచ్చిన డైలాగ్స్‌ను తనదైన స్టైల్లో ఇంప్రూవ్ చేసి చెబుతుంటారు అరవింద్ స్వామిగారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. వెంకట్‌గారు ఏ స్క్రిప్ట్ అయితే నాకు చెప్పారో అదే తీశారు. ఆయన స్క్రీన్‌ప్లే స్టయిల్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ స్టోరీకి తగ్గట్లుగానే ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవుట్‌పుట్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నాను. పోలీస్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో నాకు ‘ఘర్షణ’, నాన్నగారి ‘శివమణి’, ‘జేమ్స్ బాండ్’ యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలు ఇష్టం. ► నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు సెట్స్‌లో కూల్‌గా ఉంటారు. ‘కస్టడీ’ నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ సినిమా 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇళయరాజాగారు, యువన్ శంకర్రాజాగార్లు ఇచ్చిన మ్యూజిక్ ‘కస్టడీ’కి ప్లస్. ‘కస్టడీ’ని వేరే సినిమాతో పోల్చవద్దు. ‘కస్టడీ’ చిత్రం ‘కస్టడీ’యే. ► నేను తెలుగు డబ్బింగ్ కోసం దాదాపు పది రోజులు తీసుకుంటాను. కానీ తమిళ ‘కస్టడీ’ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేయడానికి నెలరోజుల టైమ్ పట్టింది. నా సొంత వాయిస్ అయితే ఆడియన్స్‌కు యాక్టర్‌గా చేరువకావొచ్చు. మన పెర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. అందుకే తమిళంలో డబ్బింగ్ చెప్పాను. ► నేను ఫలానా రకమైన సినిమాలు చేస్తేనే ఆడియన్స్‌కు నచ్చుతాయని అదే ట్రాక్‌లోకి వెళితే ఓ యాక్టర్‌గా అది నా బలహీనత అవుతుంది. ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేను. గతంలో నేను చేసిన కొన్ని లవ్‌స్టోరీలు వర్కౌట్ అయ్యాయి. అలా అని అవే సినిమాలు చేస్తుంటే ఓ యాక్టర్‌గా ఎదగలేను. చైతన్య ఎలాంటి సబ్జెక్ట్ అయినా బాగా చేస్తాడని ఆడియన్స్‌తో అనిపించుకోవాలి. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులకు ఏ రకమైన సినిమాలు నచ్చుతున్నాయో తెలుసుకోవడం చాలెంజ్లా మారింది. కానీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇస్తే వారి ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. ► నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. ‘ధూత’ వెబ్ సిరీస్ రిలీజ్ అమెజాన్ చేతిలో ఉంది. ఈ ఏడాదే స్ట్రీమింగ్ స్టార్ట్ కావొచ్చు. మా తాతగారు, నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. కొన్ని స్టాండర్ట్స్ క్రియేట్ చేశారు. కొందరు వారితో మాకు పోలికలు పెడుతుంటారు. అయితే ఈ విషయాన్ని నేను ఓ ప్రెజర్లా తీసుకోను. చాలెంజ్లా స్వీకరించి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ స్థాయికి నేను రీచ్ అవుతానా? లేదా అనేది నాకు తెలియదు. కానీ నా శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉంటాను. నా గురించిన కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి (విడాకుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..). డిఫరెంట్ వార్తలు రాస్తున్నారు. కానీ ఆడియన్స్ ఫూల్స్ కాదు. తెలివైనవారు. ఏది జెన్యూన్ న్యూస్.. ఏది కాదనేది వారికి తెలుసని అనుకుంటున్నాను. నేను అయితే నవ్వుకుని వదిలేస్తున్నాను. -
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ – ‘‘రవితేజ నాకు బ్రదర్‌లాంటివారు. మీరు (రవితేజ) హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘ఎఫ్ఐఆర్’ ఒకేసారి విడుదలవుతున్నాయని నేను అన్నప్పుడు ‘అయితే.. ఏంటి?’ అన్నట్లు ఆయన కూల్‌గా రిప్లై ఇచ్చారు. రవితేజగారు లేకపోయినట్లయితే తెలుగులో ‘ఎఫ్ఐఆర్’ రిలీజ్ సాధ్యమయ్యేది కాదు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్స్ కూడా చేస్తాను’’ అన్నారు. ‘‘విష్ణు విశాల్గారిని హీరోగా అనుకుని ఆయనకు ఈ కథ చెప్పాను. కానీ పరిస్థితుల కారణంగా హీరోగా నటించడంతో పాటు ఆయన నిర్మించాల్సి వచ్చింది కూడా. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమా అయింది’’ అన్నారు మను ఆనంద్. ‘‘ఎఫ్ఐఆర్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని విష్ణు విశాల్‌తో చెప్పాను. మాకు సపోర్ట్ చేసిన రవితేజకు ధన్యవాదాలు’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విష్ణు విశాల్ సతీమణి గుత్తా జ్వాల. ‘‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత నేను ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’’ అన్నారు మంజిమా మోహన్. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని ‘ఎఫ్ఐఆర్’ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. -
నో డూప్
ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్ లేకుండా ఫైట్స్ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. -
చెన్నై పక్కమ్ వాంగ
చెప్పాల్సిన కథలో రీచ్ ఎక్కువున్నప్పుడు బైలింగువల్ (ద్విభాషా చిత్రం) ప్లాన్ చేస్తారు హీరోలు. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు శర్వానంద్. త్వరలోనే ఓ బైలింగువల్ చిత్రాన్ని పట్టాలెక్కించి చెన్నై టు హైదరాబాద్ ప్రయాణం చేస్తారట శర్వా. డ్రీమ్ వారియర్ బ్యానర్‌పై నిర్మాత యస్. ఆర్. ప్రభు తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. నూతన దర్శకుడు తయారు చేసిన ఈ కథలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్ ‘96’ రీమేక్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘96’ రీమేక్ తర్వాత ఈ ద్విభాషా చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్రెడీ తమిళంలో కొన్ని సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులను పలకరించారు శర్వా. ‘గమ్యం’ తమిళ రీమేక్ ‘కాదల్ సుమ్మా ఇల్లై, నాళై నమదే, ఎంగేయుమ్ ఎప్పోదుమ్, జేకే ఎనుమ్ నన్బన్ వాళ్కై’ అనే సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమిళంలో చెన్నై పక్కమ్ వాంగ (చెన్నై వైపు రండి) అని పలు అవకాశాలు వచ్చినా శర్వా తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు. ఈ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చేసిన గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్‌కు రెడీగా అవుతోంది. -
కొత్త జానర్.. కొత్త జర్నీ
లవ్, కామెడీ, యాక్షన్... ఇప్పటివరకూ ఈ జానర్ సినిమాలే చేశారు సందీప్ కిషన్. ఫర్ ఎ చేంజ్.. ఈసారి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్‌రాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ బైలింగువల్ సినిమాను బుధవారం అనౌన్స్ చేశారు సందీప్ కిషన్. ‘‘నా నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు సూపర్ ఎగై్జటింగ్‌గా ఉంది. సూపర్ న్యాచురల్ ఎంటర్ౖటñ నర్గా ఉండబోతోంది. కొత్త జర్నీకి మమల్ని విష్ చేయండి’’ అని పేర్కొన్నారాయన. ఈ సినిమాకు యస్.యస్. తమన్ సంగీత దర్శకుడిగా, పీయస్ వర్మ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్ నటించిన బైలింగువల్ మూవీ ‘నరగాసురన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్
మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్జే సూర్య, ఆర్జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.