మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్
మహేష్ సినిమాలో గోల్డెన్ చాన్స్
Published Mon, Dec 12 2016 2:19 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM
మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరి గంతేస్తాం. అలాంటిది తెలుగులోను, తమిళంలోను ఒకేసారి తీస్తున్న సినిమాలో అవకాశం వస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. సరిగ్గా అలాంటి అవకాశమే భరత్‌కు వచ్చింది. సినిమాలో ఒక కీలక పాత్రకు భరత్‌ను తీసుకున్నామని, అతడి పాత్ర ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు బయటకు రానివ్వబోమని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమా కథ దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనది కావడం వల్లే ఇలా చేస్తున్నామన్నారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. సినిమా టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, 'సంభవామి' అనే టైటిల్ ఒకటి పరిశీలనలో ఉందని సినిమా వర్గాలు చెప్పాయి. వచ్చే సంవత్సరం జనవరిలో టైటిల్ ఏంటన్నది ఫిక్స్ చేస్తామన్నారు. ఇప్పటికి తమ చేతిలో నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఎస్‌జే సూర్య, ఆర్‌జే బాలాజీ, ప్రియదర్శి పులికొండ ఉన్నారు. హ్యారిస్ జజరాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Advertisement
Advertisement