వయ్యారంగా వెక్కిరించడమే! | He was not the author of sinigitam | Sakshi
Sakshi News home page

వయ్యారంగా వెక్కిరించడమే!

Published Mon, Apr 28 2014 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

వయ్యారంగా వెక్కిరించడమే!

వయ్యారంగా వెక్కిరించడమే!

విశ్లేషణ

ఈ పాట నుండి ఉద్భవించేది సాముదాయకమైన రసం. పాటలో విషయం భాగ్యవంతుణ్ణి ఆక్షేపించడం. ఒళ్లొంచి పని చేయకుండా సుఖాలనుభవించేవారిని వయ్యారంగా వెక్కిరించడం. హాల్లో జనంలో చాలామంది ‘బీదలే’- అంటే కష్టపడి పనిచేసి పొట్టపోసుకునేవారే. వారికి సినిమా కసి ఉంటుంది. ఆ ‘కసి’ ఈ పాట ద్వారా బయటపడుతుంది. వారి మనస్సులో రహస్యంగా ఉన్న ఆవేదన, వ్యధ, ఇతరులతో పంచుకోవడంతో తగ్గుతుంది. అందుకని, ఈ పాట సినిమా హాల్లో బాగా రక్తి కడుతుంది.

హాల్లో జనం ఏ పదిమందో ఉండి సినిమా చూస్తే చిత్రం ఎంత మంచిదైనా రక్తికట్టదు. సామూహిక ఉద్రేకానికి అంతటి ప్రభావం ఉంది. ఈ పాట వచ్చిన కొత్తలో ‘‘చాలా బాగుందండీ పాట’’ అన్నాను శ్రీశ్రీగారితో, ఆయనే వ్రాశాడనుకుని. కానీ, వ్రాసింది ఆయన కాదట. ఆచార్య ఆత్రేయట. కానీ నేను పెదవి కొరుక్కోనక్కర్లేదు- మీరూ అంతే!!

(‘తోడికోడళ్ళు’ చిత్రానికి ఆత్రేయ రచించిన ‘కారులో షికారుకెళ్లే...’ సినీగీతం గురించి రచయిత బుచ్చిబాబు)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement