ఈ వీకెండ్ హైదరాబాద్లో.. | this weekend events in hyderabad city | Sakshi
Sakshi News home page

ఈ వీకెండ్ హైదరాబాద్లో..

Published Fri, Nov 6 2015 11:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఈ వీకెండ్ హైదరాబాద్లో.. - Sakshi

ఈ వీకెండ్ హైదరాబాద్లో..

హ్యాపీ స్ట్రీట్స్: 'రాహ్గిరి' తరహాలో నిర్వహిస్తున్న 'హ్యాపీ స్ట్రీట్స్' ఈవెంట్ ఈ ఆదివారం కూడా ఉల్లాసాన్ని పంచనుంది. ప్రతి ఒక్కరూ డాన్సింగ్, సైక్లింగ్ తదితర ఈవెంట్లలో పాల్గొని ఎంజాయ్ చెయ్యొచ్చు.  


స్థలం: నేరేడ్మెట్ క్రాస్రోడ్స్ నుంచి ఏఎస్ రావ్ నగర్ క్రాస్రోడ్స్ వరకు
సమయం: ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు
నిర్వాహకులు: సైబరాబాద్ పోలీస్, టైమ్స్ ఆఫ్ ఇండియా

ఆర్ట్


ఆర్ట్ ఆఫ్ డైనమిక్: నగేశ్ గౌడ్,అఫ్జా తమ్కానత్ ఇంకా ఇతర సుప్రసిద్ధ ఆర్టిస్టులు గీసిన కళాఖండాల ప్రదర్శన
స్థలం: దైరా సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 5
సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు. నవంబర్ 15 వరకు ఈ ఈవెంట్ జరగనుంది.

ఆర్ట్ ఆఫ్ కన్సర్న్: శ్యామల్ ముఖర్జీ, జితేన్ హజారికా, మహమ్మద్ ఉస్మాన్ వంటి దిగ్గజ చిత్రకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న పెయింటిగ్స్ ప్రదర్శన
స్థలం: తాజ్ డెక్కన్ హోటల్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు. నవంబర్ 21 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.

మ్యూజిక్

ప్లే ఫర్ ఎ కాజ్: క్లాసికల్ రాక్ బ్యాండ్ పరిక్రమ, లూక్ కెన్నీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్
స్థలం:హోటల్ దస్ పల్లా, జూబ్లీ హిల్స్
సమయం: నవంబర్ 6న రాత్రి 7:30 గంటల నుంచి

థియేటర్

డెత్ వేరియేషన్స్: మరణాన్ని ఇతివృత్తంగీ తీసుకుని కేకే రైనా దర్శకత్వం వహించిన నాటకం డెత్ వేరియేషన్ ప్రదర్శన. సయ్యద్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ సమర్పణ
స్థలం: తారామతి బారాదరి, గండిపేట
సమయం: నవంబర్ 6న రాత్రి 7:30 గంటల నుంచి

షీ- హీ- షే: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచించిన 'షే' కథాంశం, ఆయన తొమ్మిది మంది మనవరాళ్లు రాసిన సాహస కథలను నాటకాలుగా ప్రదర్శించనున్నారు.
స్థలం: శిల్పకళావేదిక, హైటెక్ సిటీ, మాదాపూర్
సమయం: నవంబర్ 6న సాయంత్రం 6:30 నుంచి

శక్తి నీలోనే ఉంది: మహిళల దైనందిన జీవితంలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా రూపొందించిన 'శక్తి నీలోనే ఉంది' నాటక ప్రదర్శన
స్థలం: లమకాన్, జీవీకే వన్ ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1
సమయం: నవంబర్ 7న సాయంత్రం 7 గంటల నుంచి

ఏప్రిల్ ఫూల్: నలుగురు స్నేహితులు ఒక గదిలో వేసే కుప్పిగంతుల ఆధారంగా రూపొందించిన ఏప్రిల్ ఫూల్ నాటక ప్రదర్శన
స్థలం: లమనాన్, జీవీకే వన్ ఎదురుగా, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 1
సమయం: నవంబర్ 8, రాత్రి 8 గంటల నుంచి

ఫొటోగ్రఫీ

ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ సౌరభ్ ఛటర్జీ.. వివిధ సందర్భాల్లో క్లిక్ మనిపించిన, కనువిందుచేసే ఫొటోల ప్రదర్శన
స్థలం: అవర్ సేక్ర్డ్ స్పేస్, ఇస్కాన్ ఆలయం దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్
సమయం: నవంబర్ 8 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు

స్క్రీనింగ్

మజబ్స్ జర్నీ: సినిమాటోగ్రాఫర్గా ఎదిగి, అనంతరం నాజీల చేతికి చిక్కి కాన్సంట్రేషన్ క్యాంప్లో దుర్మరణం చెందిన జర్మన్ కెమెరామన్పై ఆ దేశానికే చెందిన ఈవా కోఫ్ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన.
స్థలం: గోథెజంత్రం, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3
సమయం: నవంబర్ 6న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం

నవంబర్ డేస్: బెర్లిన్ గొడను తమ చేతులతో కూల్చేసిన వ్యాక్తులతో దర్శకుడు మాక్స్ ఓఫుల్స్ చేసిన ఇంటర్వ్యూలతో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శన
స్థలం: గోథెజంత్రం, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3
సమయం: నవంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు

సినిమా: 'ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్' సినిమా ప్రదర్శన
స్థలం: లమకాన్, జీవీకే వన్ ఎదురుగా, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్
సమయం: నవంబర్ 18న, సాయంత్రం 6:30 గంటలకు

ఫుడ్

దీపావళి సందర్భంగా నగరంలోని పలు రెస్టారెంట్లు,హోటళ్లు ప్రత్యేక వంటకాలతో నోరూరించనున్నాయి
ప్యూర్ వెజ్ ఐస్ క్రీమ్స్ ఇన్ 70 డిఫరెంట్ ఫ్లేవర్స్
స్థలం: హావ్ మోర్ హాచ్ పాచ్ రెస్టారెంట్, సన్ షైన్ హాస్పిటల్ పక్కన,  పీజీ రోడ్, సికింద్రాబాద్
సమయం: ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు

రాయల్ రేవ్: 15 శాతం డిస్కౌంట్తో మత్తెక్కించే మందు, పసందైన విందు
స్థలం: రాయల్ రేవ్ హోటల్, రిలయన్స్ డిజిటల్ పక్కన, సరోజినిదేవీ రోడ్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు

ఫ్రోజెన్ డెజర్ట్: కొత్తరకం ఐస్ క్రీమ్స్ కోసం
స్థలం: ఫ్రోజెన్ డెజర్ట్, ఏ-13, రుక్మిణిపురి, ఏఎస్ రావ్ నగర్, శారద థియేటర్ బస్ స్టాప్ దగ్గర
సమయం: ఉదయం 11 నుంచి అర్ధరాత్రి వరకు

పంజాబీ అఫైర్: ఫుడ్ గైడ్ అవార్డును సొంతం చేసుకున్న పంజాబీ అఫైర్ రెస్టారెంట్ ఇటీవలే ప్రారంభించిన కొత్త బ్రాంచ్ లో బర్త్ డే, కిట్టీపార్టీలు, చిన్నాపెద్ద ఈవెంట్లలకు వేదికగా నిలుస్తోంది.
స్థలం: పంజాబీ అఫైర్, రెండో అంతస్తు, విశాల్ టవర్స్, ఫోక్స్ వాగన్ షోరూమ్ ఎదురుగా, తిరుమలగిరి ఎక్స్ రోడ్స్
సమయం: మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 11 వరకు

ది కాఫీ కప్: రుచికరమైన కొత్తరకం కాఫీలు, స్నాక్స్
స్థలం: ది కాఫీ కప్, ఈ-89, మొదటి అంతస్తు, కెనరా బ్యాక్ పైన, సైనిక్ పురి, సికింద్రాబాద్
సమయం:ఉదయం 9 నుంచి రాత్రి 11:30 వరకు

గ్రిల్: ఓ మంచి విందుకు వేదిక
స్థలం: గ్రిల్ 9, షాప్ నంబర్ 13, హెచ్ఏసీపీ కాలనీ, విక్రమ్ పురి రోడ్డు, కార్ఖానా
సమయం:మధ్యహ్నం 12:30 నుంచి రాత్రి 11:30 వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement