మన హైదరాబాద్లో ఈ వీకెండ్.. | the events of weekend in hyderabad | Sakshi
Sakshi News home page

మన హైదరాబాద్లో ఈ వీకెండ్..

Published Fri, Oct 2 2015 9:20 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

మన హైదరాబాద్లో ఈ వీకెండ్.. - Sakshi

మన హైదరాబాద్లో ఈ వీకెండ్..

రోజంతా తీరిక లేకుండా రద్దీ జీవితం అనుభవించేవారికి హైదరాబాద్ నగరం ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారి వాటికి వెళ్లి వచ్చారంటే మనసు తేలికపడుతుంది. ఓ మాటలో చెప్పాలంటే రీ ఫ్రెష్ ఇట్టే అయిపోతారు. ఒక్కసారి ఈ వీకెండ్కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఏంటో పరిశీలిస్తేజ..

వీధుల్లో హాయ్ హాయ్..
సైబరాబాద్ పోలీసులు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెరేడ్మెట్ క్రాస్ రోడ్స్ నుంచి ఏఎస్ రావ్ నగర్ క్రాస్ రోడ్స్ వరకు ప్రతి ఆదివారం హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమం. డాన్సింగ్, సిక్లింగ్, జుంబా ఇంకా మరిన్ని ఈవెంట్స్..
స్థలం: నేరెడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి ఎస్ రావు నగర్ క్రాస్ రోడ్డు వరకు.
సమయం: ఆదివారం, అక్టోబర్ 4, ఉదయం 6 గంటల నుంచి 9.30గంటల వరకు.

కళల విభాగం
'ది ఫుల్ స్కేల్'
ప్రముఖ కళాకారులు కరుణా సుక్కా, లక్ష్మీ కిరణ్, గాయత్రి, భాస్కర్ వడ్లాచే రూపొందించిన చెక్కతో చేసిన కళాకృతుల ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: ది ఆర్ట్ స్పేస్, ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్, దారం కరణ్ రోడ్డు, అమీర్ పేట,
సమయం: సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 17 వరకు, ఉదయం 11గంటల నుంచి 7గంటల వరకు.

'త్రెడ్ బై త్రెడ్': ముంబయికి చెందిన అంతర్జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ కళాకారుడు బాప్తిస్త్ కొలెవో గీసిన చిత్రాల ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: గోతే-జెంట్రం, జర్నలిస్టు కాలనీ, రోడ్డు నెం 3, బంజారా హిల్ల్స్, సమయం: అక్టోబర్ 9, సాయంత్ర 6.30

కరుణ కళల ప్రదర్శన
రిషికేశ్ కరుణ అనే ప్రముఖ కళాకారుడి చేతి నుంచి జాలువారిన కళా రూపాల ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: సీ 519, గ్రీన్ వుడ్ రెసిడెన్సీ, కోకుర్, యాప్రాల్ హనుమాన్ టెంపుల్ దగ్గర, సైనిక్ పురి
సమయం: అక్టోబర్ 11 వరకు, ఉదయం 11 గంటల నుంచి 8గంటల వరకు.


శేష్ లేఖ బై పరేశ్ మైతి: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన చివరిరోజుల్లో రచించిన పద్యాలను స్పూర్తిగా తీసుకుని బెంగాలీ చిత్రకారుడు పరేశ్ మైతి రూపొందించిన చిత్రాల ప్రదర్శన
స్థలం: హయత్ హైదరాబాద్ హోటల్, రోడ్ నంబర్- 2, గచ్చిబౌలి
సమయం: ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు. అక్టోబర్ 27 వరకు.

విత్ అవుట్ యాసిడ్:  ప్రముఖ చిత్రకారిణి మాలవికా రెడ్డి ఆధ్వర్యంలో పెయింటింగ్స్ సోలో ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: ది గ్యాలరీ కేఫ్, రోడ్డు నెంబర్ 10, బంజారా హిల్స్
సమయం: అక్టోబర్ 30, ఉదయం11.30 నుంచి రాత్రి 10.30 వరకు

వెళ్లండి.. హాయిగా నవ్వుకోండి
ప్రముఖ హాస్యకారుడు డాన్ నైనాన్తో హాస్య భరిత కార్యక్రమం(లాఫ్ అవుట్ లౌడ్ విత్ డాన్). ఈయన ప్రపంచ వ్యాప్తంగా మాటలతో హాస్యాన్నిపండించడంలో గుర్తింపుపొందారు. బరాక్ ఒబామా కోసం కూడా ఓ కార్యక్రమం నిర్వహించారు.
స్థలం: హెచ్ఐసీసీ, హైటెక్ సిటీ
తేది: అక్టోబర్ 9, రాత్రి 7.30 గంటలకు

పినాయియో అండ్ హాఫ్ చికెన్: ఇది చిన్నపిల్లలను ఆహ్లాదపరిచే కార్యక్రమం.
స్థలం: లమకాన్, జీవీకే ఒన్ ఎదురుగా రోడ్డు నెంబర్ 1, బంజారాహిల్స్
సమయం: అక్టోబర్ 3, సాయంత్రం 6గంటలకు


అగ్నెస్ ఆఫ్ గాడ్: నమ్మకం, విశ్వాసాలమధ్య పెనుగులాడేలా చేసే అద్భుత నాటకం. దీనిని జాన్ పీమర్ రాయగా వినయ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నాటకం ఇప్పుడు నగరంలో ప్రదర్శిస్తున్నారు.
భాస్కర ఆడిటోరియం, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ నాంపల్లి
సమయం: అక్టోబర్ 9, 10, సాయంత్రం 7.30గంటలకు

ఫొటోగ్రఫీ ఫెస్ట్: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్.. 'ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్' ను నిర్వహిస్తోంది.
స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్
సమయం: అక్టోబర్ 1 నుంచి 10 వరకు, ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు

సంగీతం, న్యత్య విభాగం
పడిల్ ఆఫ్ మడ్ బ్యాండ్ లైవ్
కాన్సాస్ సిటీకి చెందిన ప్రముఖ రాక్ స్టార్ వెస్ స్కాంట్లిన్ ఆధ్వర్యంలో అదిరిపోయే రాక్ బ్యాండ్ షో..
హార్డ్ రాక్ కేఫ్, రోడ్డు నెంబర్ 1, బంజారాహిల్స్
సమయం: అక్టోబర్ 3, రాత్రి 8గంటలకు.

అనిల్ శ్రీనివాసన్ టచ్-పియానో
ప్రముఖ క్లాసికల్ పియానో వాయిద్యకారుడు అనిల్ శ్రీనివాసన్ పూర్తిగా భారతీయ సాంప్రదాయంతో నింపి రూపొందించిన కొత్త ఆల్బమ్ 'టచ్' ప్రదర్శన కార్యక్రమం.
స్థలం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్
సమయం: అక్టోబర్ 3, రాత్రి 7.30గంటలకు

వీహెచ్1 సూపర్ సోనిక్ ఆర్కేడ్
గ్రామీ అవార్డు విజేత, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్, డీజే గాయకుడు స్కిల్ రెక్స్ నగరాన్ని తన అదిరిపోయే పాటలతో ఉర్రూతలూరించనున్నారు.
స్థలం: గచ్చిబౌలి స్టేడియం
సమయం: అక్టోబర్ 9, రాత్రి 8గంటలకు

మంతన్ సంవాద్
ప్రముఖ వ్యక్తుల ప్రసంగాలతో మంతన్ సంవాద్ కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రముఖ రచయిత టీఎం కృష్ణ, ప్రముఖ న్యత్యకారిణి, సామాజికవేత్త మల్లికా సారభాయి పాల్గొని భిన్న అంశాలపై తమ వాణిని వినిపించనున్నారు.
స్థలం: జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫిల్మ్ నగర్
సమయం: అక్టోబర్ 2, ఉదయం 8.45 నుంచి సాయంత్రం 5.30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement