హైదరాబాద్లో ఈ వీకెండ్..
వారమంతా క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీ పనులతో సతమతమయ్యే నగర వాసులకు ఈ వీకెండ్ మరింత ఉత్సాహాన్ని అందించనుంది. హైదరాబాద్ నగరంలో ఈ వారంతంలో ఎన్నో ఆహ్లాదభరిత కార్యక్రమాలు మీ ముందుకొస్తున్నాయి. ఒక్కసారి ఏదో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారంటే మనసుకు ప్రశాంతత చేకూరి సేదతీరవచ్చు. ఒక్కసారి ఈ వీకెండ్కు సంబంధించిన ఆ ఈవెంట్స్ ఇలా ఉన్నాయి...
సినీ భస్మాసుర నాటక ప్రదర్శన:
నగరంలోని రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. పలువురు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నటులు పాత్రధారులుగా కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తారు.
స్థలం: రవీంద్రభారతి
సమయం: నవంబర్ 21, 22, సాయంత్రం 7 గంటలకు ప్రారంభం
మ్యూజిక్ అండ్ డ్యాన్స్:
ఫస్ట్ హైదరాబాద్ జాజ్ ఫెస్టివల్
స్థలం:: సికింద్రాబాద్ క్లబ్, పికెట్, సికింద్రాబాద్
సమయం: నవంబర్ 25-27 తేదీలు, రాత్రి 7:30 గంటలకు
సరదాగా సల్సా: డ్యాన్సింగ్ పార్ట్నర్ ఉండేవాళ్లు సల్సా డ్యాన్స్ చేయవచ్చు.
స్థలం: అవర్ సాక్రిడ్ స్పేస్, ఐఎస్కేకాన్ దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, వెస్ట్మారేడ్పల్లి
సమయం: నవంబర్ 22, సాయంత్రం 6 గంటలకు
ది గోల్డెన్ ఎలిఫెంట్ (అంతర్జాతీయ బాలల 19వ ఫిల్మ్ ఫెస్టివల్-2015)
ఈ కార్యక్రమంలో భాగంగా 80 దేశాలకు చెందిన 1200కు పైగా సినిమాలను ప్రదర్శిస్తారు 19 భారత చిత్రాలు కూడా ఉన్నాయి.
లేబ్రింతస్: 14 ఏళ్ల బెల్జియం బాలుడు రూపొందించిన కంప్యూటర్ గేమ్ మూవీ.
స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 1, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు
ఎక్ థా భుజంగ్: పదేళ్ల భారతీయ బాలుడు శ్రీకృష్ణుడిగా వేసిన స్కూల్ డ్రామా.
స్థలం:: ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 11:20 గంటలకు
ఎల్లో ఫెస్టివల్ : భారతీయ యువతి, ఆమె తల్లి సంభాషణ ఆధారంగా తీసిన చిత్ర ప్రదర్శన
స్థలం: ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 12:45 గంటలకు
ఎ డాటర్స్ డ్రీమ్: ఏడేళ్ల పేద భారతీయ బాలిక తన కలను ఎలా సాకారం చేసుకుంటుందన్న అంశంపై సినిమా
స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు
ఎ రెయినీ డే: భారతీయ చిత్రం. భర్త చేసే అవినీతిని భార్య కలలో తెలుసుకోవడం అంశంగా తీసిన చిత్ర ప్రదర్శన
స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 1:30 గంటలకు
ఏ టైన్ కాల్డ్ పానిక్: యానిమేషన్ టాయ్స్, వాటి యాత్రలు. ఇది బెల్జియం ఫిల్మ్.
స్థలం:: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 9:30 గంటలకు
ఏ సే భళ్లాజీ: ఇండియన్ టీచర్ విద్యార్థులను ఎలా అర్థం చేసుకుంటుంది.
స్థలం: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 3, ఎన్టీఆర్ గార్డెన్స్, ఖైరతాబాద్
సమయం: నవంబర్ 20, ఉదయం 11:50 గంటలకు
బుక్ సెల్లర్ ఫ్రమ్ మౌంటేన్స్: పదో తరగతి విద్యార్థి తన అభిమాన రచయిత రస్కిన్ బాండ్ను కలుసుకోవడం అంశంగా భారతీయ సినిమా.
సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 12:10 గంటలకు
ఐ హావ్ జస్ట్ హాడ్ ఏ డ్రీమ్: ఇద్దరు బాలికలకు ఒకే కల రావడంపై స్పానిష్ మూవీ
సమయం: నవంబర్ 20, మధ్యాహ్నం 1:10 గంటలకు
థియేటర్:
డార్క్ లైట్: కుటుంబం, స్నేహం అంశాలతో జీవితం, ఎదురయ్యే సమస్యలను చూపించే లఘు చిత్రాల ప్రదర్శన
స్థలం: లామాకాన్, జీవీకే ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1
సమయం: నవంబర్ 21, రాత్రి 8 గంటలకు
ది షాడో ఆఫ్ లైప్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల జీవితంపై నాటకం
స్థలం: లామాకాన్, జీవీకే ఎదురుగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1
సమయం: నవంబర్ 28, రాత్రి 7 గంటలకు
కెవిన్ కార్టర్స్ లెన్స్: సోలో థియేటర్ ఫర్మార్నెన్స్. దక్షిణాఫ్రికా ఫొటో జర్నలిస్ట్ కెవిన్ కార్టర్ జీవితం ఆధారంగా నాటకం
స్థలం: అవర్ సాక్రిడ్ స్పేస్, ఐఎస్కేకాన్ దగ్గర, సర్దార్ పటేల్ రోడ్, వెస్ట్మారేడ్పల్లి
సమయం: నవంబర్ 20, రాత్రి 7 గంటలకు
కళలు:
కళల ప్రదర్శన: వార్షిక కళా ప్రదర్శన కార్యక్రమం. దేశంలోని 34 మంది కళాకారులు తమ ప్రతిభను ఇక్కడ మనం వీక్షించవచ్చు.
స్థలం: తాజ్ డెక్కన్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1
సమయం: నవంబర్ 21, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు
పెయింటింగ్స్ గ్యాలరీ:
తోట వైకుంఠం, కవిత దుష్కర్, అంజనీ రెడ్డి, తదితరుల పెయింటింగ్స్ గ్యాలరీ ప్రారంభం. చూడచక్కని చిత్రాలను చూసి ఆస్వాదించవచ్చు
స్థలం: గ్యాలరీ స్పేస్, ప్లాట్ నం. 259/సి, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ
సమయం: నవంబర్ 22, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం
ది ఆర్ట్ స్పేస్:
తెలంగాణ చిత్రకారుడు, ప్రింట్ మేకర్ భోలేకర్ శ్రీహరి హస్త కళా ప్రదర్శన
స్థలం: ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్, ధరంకరమ్ రోడ్, అమీర్పేట
సమయం: డిసెంబర్ 5, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు