కిల్లింగ్..రేస్!
తిరుపతిలో విచ్చలవిడిగా బైక్ రేసింగ్
వీకెండ్‌లో రెచ్చిపోతున్న యువత
సంపన్నవర్గాల వారే అధికం
తిరుపతి క్రైం: తిరుపతిలో బైక్ రేసింగ్ లు విచ్చలవిడిగా సాగుతున్నారుు. నగరానికి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు వారాంతపు రోజుల్లో నగర సరిహద్దులు, శివార్లలో రేస్‌లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డుపై వెళుతున్న సామాన్య జనాలనూ ప్రమాదాలబారిన పడేస్తున్నారు. పట్టణంలో వరుసగా జరుగుతున్న వివిధ రోడ్డు ప్రమాదాలకు ఈ రేసింగులూ కారణమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారుు.
వీకెండ్‌లో జోరు
శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువగా బైక్‌రేసింగ్‌లు జరుగుతున్నారుు. ఎరుుర్ బైపాస్‌రోడ్డు, మంగళం రోడ్డు, జూపార్క్ రోడ్డు, శ్రీనివాస కల్యాణ మండపం రోడ్డు నుంచి తిరుచానూరు వరకు, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారుల్లో ఈ పోటీలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాత్రి పూటే ఎక్కువ
కొందరు యువకులు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా బయలుదేరుతారు. పందెంలో పాల్గొనే వారు గేమ్ పగలా.. రాత్రా అనేది ముందే డిసైడ్ చేసుకుంటారు. రాత్రి వేళ అరుుతే ఎవరూ పట్టించుకోరన్న నెపంతో రేస్‌లు ఆడుతున్నారు. పందెంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలి. ఈ గేమ్‌లో గెలిస్తే కట్టిన దానికంటే రెట్టింపు డబ్బు వస్తుంది.
ఖరీదైన బైకులు
ఈ రేసుల్లో పాల్గొనే వారు ఖరీదైన స్పోర్‌ట్స్ బైక్‌లే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరు యువకులైతే హెల్మెట్, గ్లౌజులు ధరించి రేజింగ్‌కు హాజరవుతున్నారు. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అందరూ బడా బాబులేనా?
ఈ రేసింగ్‌లో పాల్గొంటున్న వారందరూ సంపన్నులు, పారిశ్రామిక కుమారులే కావడం గమనార్హం. వీరందరూ కేవలం రేసింగ్‌పై మోజుతోనే పాల్గొంటున్నారు. ఈ బైక్ రేస్ గెలుపొందిన డబ్బులతో వీకెండ్ పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం రేసింగ్‌లో పాల్గొంటున్న వారేకాక రోడ్డుపై వెళ్లే సామాన్య ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు.
రేసింగ్ జరగడం లేదు
నగరంలో బైక్ రేస్‌లు జరగడంలేదు. కొందరు యువకులు 200 సీసీ వాహనాలతో అధిక స్పీడ్‌తో వెళుతున్నారు. ఆ సమయంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా సదరు యువకులు ప్రమాదానికి గురికావడం, ఎదుటవారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. వారిని నియంత్రించేందుకు పోలీసులు సామరస్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. - డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ