మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ సంక్రాంతి సందడి ఉండనుంది. ఇందుకు తగ్గట్లే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆయా హీరోల ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్.. వీటి కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనే ఆత్రుత కూడా ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే టైంలో ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.
ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', 'కిల్లర్ సూప్', 'అజయ్ గాడు' చిత్రాలతో పాటు 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' సిరీస్ మూడో సీజన్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంటే థియేటర్లకి వెళ్లి కొత్త మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వీటిని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంతకీ ఓటీటీల్లో ఏ సినిమా ఎప్పుడు రానుందనో తెలుసా?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ (జనవరి 08 నుంచి 14 వరకు)
నెట్‌ఫ్లిక్స్
- ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 08
- డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) - జనవరి 09
- పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09
- క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
- కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) - జనవరి 10
- ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
- బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
- ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
- డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) - జనవరి 11
- కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) - జనవరి 11
- మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) - జనవరి 11
- సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
- ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) - జనవరి 12
- అడిరే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12
- లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 12
- లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) - జనవరి 12
- డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 13
అమెజాన్ ప్రైమ్
- 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 11
- మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 11
- రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12
జీ5
- అజయ్ గాడు (తెలుగు సినిమా) - జనవరి 12
హాట్‌స్టార్
- ఎకో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11
- ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12
సోనీ లివ్
- చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12
- జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
- టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
- ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10
బుక్ మై షో
- జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09
- వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09
Comments
Please login to add a commentAdd a comment