
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం మొత్తం ఒడిదుడుకులకు గురైన వారాంతాన్ని లాభాల్లో ముగించాయి. శుక్రవారం రోజున ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 465 పాయింట్ల వరకు ఎగువకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిన్, ఫైనాన్సియల్ సర్వీసెస్, మెటల్ స్టాకుల అండతో భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. అయితే ఐటీ, ఫార్మా కంపెనీలు నష్టాల్లోకి జారుకోవడంతో లాభాలు కొంత మేర తగ్గుముఖంపట్టాయి.
మార్కెట్ చివరి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 38,127 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,305 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ (4.19%), వేదాంత లిమిటెడ్ (3.96%), టాటా మోటార్స్ (3.81%), ఓఎన్జీసీ (2.95%), టాటా స్టీల్ (2.94%) లాభాల బాటలో పయనించగా, యస్ బ్యాంక్ (-3.30%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.96%), టీసీఎస్ (-0.87%), హీరో మోటో కార్ప్ (-0.46%) భారీగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment