
అంకెల్లో హైదరాబాద్ బిర్యానీ 20,00,000
హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది దమ్‌కీ బిర్యానీ. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 వేలకు పైగా వివిధరకాల హోటళ్లు ఉన్నాయి. అందులో పేరొందిన బిర్యానీ స్పెషల్ హోటల్స్ సుమారు 200 వరకు ఉంటాయి. బాస్మతీ బియ్యం, శ్రేష్టమైన మాంసకృత్తులు, సుగంధ ద్రవ్యాలు, గరం మసాలా దట్టించి తయారు చేస్తుండటంతో హైదరాబాద్ బిర్యానీకి మంచి డిమాండ్. మహానగరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల విలువైన బిర్యానీ అమ్మకాలు జరుగుతాయని అంచనా. వీకెండ్‌లో ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.