
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబందించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉపాసన, అభిమానుల ఈ వీకెండ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ సందర్భంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చిన చెర్రీ తన పాత స్నేహితుడితో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పాత స్నేహితుడు ఎవరనుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా మగధీరలో చరణ్ వాడిన గుర్రం.
రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోతో పాటు ఓ వీడియోనూ కూడా పోస్ట్ చేసిన ఉపాసన ‘మిస్టర్.సి ఈ వారాంతాన్ని తన పాత స్నేహితుడితో గడుపుతున్నాడు’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రంగస్థలం 1985లో చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Mr.C spending the weekend with his old buddy from #magadheera #ramacharan . 😊 pic.twitter.com/6DQ0dojS13
— Upasana Kamineni (@upasanakonidela) 12 November 2017
Comments
Please login to add a commentAdd a comment