యాడికి పోతానంటే..
ఏంది మావా...యాడికి పోతుండావు... నువ్ యాడికి పోయ్‌నా ఆడికొస్తా, మావ నీతోనే నా పెండ్లి...అంటూ వైజాగ్ అమ్మాయి అయినా రాయలసీమ యాసలో వీక్షకులకు వినోదాన్ని వడ్డిస్తోంది కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఫేం రోహిణి రెడ్డి. సిటీలో తన ‘షి’కారును ఇలా సాక్షి వీకెండ్‌తో పంచుకున్నారు...
షాపింగ్: అమీర్‌పేట, ఇనార్బిట్‌మాల్, హైదరాబాద్ సెంట్రల్‌లో..
ఇష్టమైన ఫుడ్ ప్లేసెస్: స్పైసీ ఫుడ్
అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ కేఎఫ్‌సీకి వెళ్తుంటా.
వీకెండ్‌లో..: చార్మినార్‌లో షాపింగ్ చేస్తా.. సినిమాలు చూస్తా..
గల్లీ ఫుడ్: ఐస్‌క్రీమ్స్ బాగాతింటా..
లైఫ్ అంటే.. : నవ్వుతూ ఉండాలి.. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.
- సత్య