
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు.
అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు.
రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది.