
ఓటర్లను ఏమార్చేందుకు, మోసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కళాకారుల బృందం సిద్ధమైంది. ప్రముఖ నటుడు పృథ్వీ నేతృత్వంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరిన బృందం, అన్ని జిల్లాల్లో.. పాటలు, వీధి నాటకాల ద్వారా ప్రజలను చైతన్య పరిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలను మోసం చేసేందుకు అధికార పార్టీ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తుందో తెలియజేయటంతో పాటు చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ కళాకారుల బృందం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment