‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..’అని తెలుగు భాషలో ఓ అద్భుతమైన సామెత ఉంది. దాని అర్థం అడ్డగోలుగా దారి తప్పిపోయిన వాళ్లు కూడా నీతులు వల్లించడం అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీపై సీనీ నటుడు పృథ్వీరాజ్ చేస్తున్న విమర్శలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఆయన ప్రవచించే నీతులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీలో మోసగాళ్లు ఉన్నారని, వారి చరిత్ర తన డైరీలో రాసుకున్నానని.. త్వరలోనే వారి బాగోతాలను బయటపెడతానని..ఏవోవో కారుకూతలు కూస్తున్నాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు పృథ్వీ చేయడం విడ్డూరంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. ‘బాధ్యత గల పదవిలో ఉండి అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన పృథ్వీ కూడా స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడా?’ అని నవ్వుకుంటున్నారు.
బాధ్యత గల పదవిస్తే.. వ్యవస్థకు చెడ్డపేరు
2019 సార్వత్రిక ఎన్నికల ముందు కమెడియన్ పృథ్వీ వైఎస్సార్‌సీపీ కోసం పని చేశాడు. అయితే ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమి లేదు. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పనిచేశాడనే సానుభూతితో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ )చైర్మన్ బాధ్యతల్ని పృథ్వీకి అప్పగించాడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ చైర్మన్‌గా ఉంటూ.. ఓ మహిళతో అసభ్యకర సంభాషణ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సీఎం జగన్ వెంటనే అతన్ని సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత సీఎం జగన్‌ని కలిసేందుకు, పార్టీలో పని చేసేందకు విఫల ప్రయత్నం చేశాడు. కానీ అతని పట్ల సీఎం జగన్ విముఖత వ్యక్తం చేశాడు. జగన్ కాదనడంతో చివరకు టీడీపీ, జనసేన మందలోకి చేరిపోయాడు.
భార్యను చిత్ర హింసలు పెట్టి..
కమెడియన్ పృథ్వీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. బయట పడింది ఒక్క ఆడియో టేపు మాత్రమే అని.. అంతకు మించిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్న మాట. అతని భార్య ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కింది. 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీరాజ్ వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అయితే సినిమాల్లో బిజీ అయిన తర్వాత భార్య పిల్లల్ని పట్టించుకోలేదు. 2016లో భార్యను ఇంట్లో నుంచి గెంటివేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ‘స్టార్‌డమ్ వచ్చిన తర్వాత తనను పట్టించుకోవట్లేదని, నోటికొచ్చింది తిడుతూ తనను చిత్ర హింసలు పెట్టాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు.. శ్రీలక్ష్మికి పృథ్వీరాజ్ ప్రతి నెల 8 లక్షల భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.
పృథ్వీ.. మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మెప్పు పొందడం కోసం పృథ్వీ నానా తంటాలు పడుతున్నాడు. మొన్న ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెబుతూ.. 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. ఇప్పుడేమో తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ వదిలిన బాణమని.. వైఎస్సార్‌సీపీ బాగోతాలు బయటపెడతానంటూ సినిమాల్లో మాదిరి డైలాగ్స్ చెబుతున్నాడు.
అయితే అంతకంటే నీ రాసలీలలకు సంబంధించిన మరిన్ని ఆడియోలు బయటకు రాకుండా చూస్కో అంటూ వైఎస్సారీసీపీ సానుభూతిపరులు చరకలు అంటిస్తున్నారు.అంతేకాదు మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా పృథ్వీ రాజ్ అంటూ అప్పట్లో లీకైన ఆడియో టేప్‌ని మళ్లీ వైరల్ చేస్తున్నారు.
ఆ ఆడియోలో ఏముంది?
మహిళ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణ ఇలా ఉంది..
పృథ్వీ: హాల్లో
మహిళ: సార్..హలో
పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్?
మహిళ: పడుకున్నా అన్నాను సార్
పృథ్వీ: అన్నం తిన్నవా?
మహిళ: ఇప్పుడే తిని పడుకున్నా
పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా?
మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో.
పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా?
మహిళ: ఎవరు
పృథ్వీ : నేను..
మహిళ: వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు?
పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా?
మహిళ: మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు.
పృథ్వీ : ఇప్పుడు?
మహిళ: ఇప్పుడు కూడా.
పృథ్వీ : పడుకునేటప్పుడు?
మహిళ: సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు.
పృథ్వీ : ఔనా. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా?
మహిళ: మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి.
పృథ్వీ :ఆగొచ్చు కదా?
మహిళ: అందరూ ఉన్నారుగా.
పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను.
మహిళ: వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా.
పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా.
మహిళ: తప్పకుండా సార్.
పృథ్వీ :నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా.
మహిళ: అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో?
పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్.
మహిళ: భలే చెప్తారు ఆ మాట మీరు.
పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా.
మహిళ: అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు.
పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు.
మహిళ: ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా?
పృథ్వీ :దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు.
మహిళ: నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని
పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా.
మహిళ : ఎప్పుడు?
పృథ్వీ :మధ్యాహ్నం
మహిళ: ఎక్కడ నుంచి
పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా
మహిళ: ఆ… వచ్చేశారా కిందకి?
పృథ్వీ :వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో… ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను?
మహిళ: నేను అరవను కదా.
పృథ్వీ : ముందు అరుస్తావు కదా?
మహిళ: ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు… నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా.
పృథ్వీ : సరే అయితే చెప్పు
మహిళ: ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి.
పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా.
Comments
Please login to add a commentAdd a comment