వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై హీరోయిన్‌ పూనమ్ కౌర్ ప్రశంసలు | Poonam Kaur Praises On YSRCP Government | Sakshi
Sakshi News home page

వారి కోసం చాలా మంచి పనులు చేశారు.. సీఎం జగన్‌పై హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ ప్రశంసలు

Published Wed, Mar 6 2024 3:14 PM | Last Updated on Thu, Mar 7 2024 11:48 AM

Poonam Kaur Praises On YSRCP Government - Sakshi

కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు పేద ప్రజలకు ఇచ్చే పథకాలు అన్నీ ఆపేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమం ఆపకుండా ప్రజలకు అందించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అధిక ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. కోవిడ్‌ బారిన పడిన వారికి మెరుగైన చికిత్సను అందించి..దేశానికే ఆదర్శంగా నిలిచారు.

అంతేకాదు  కోవిడ్‌–19 , బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలనూ ఆరోగ్య శ్రీలోకి చేర్చి లక్షల మంది పేదల బతుకుల్ని ఆర్థిక మహమ్మారి కాటేయకుండా కాపాడారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చేసిన కృషి​ పట్ల దేశ ప్రధానితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారు. తాజాగా కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ  చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్‌  పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.

‘కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది.  చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం’ అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

పూనమ్‌ కౌర్‌ విషయానికొస్తే.. . మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత  ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా అడపాదడపా చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారనే ఆమె ఫేమస్‌ అయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్, హీరో ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement