సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఎన్నో పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి పాటలో ఆయన వ్యక్తిత్వం కనిపించేలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. ఆయన అభిమానులు ఇప్పటికే ఎన్నో పాటలను రూపొందించారు అవన్నీ కూడా ఎంతో జనరంజకంగా ఉన్నాయి. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాయలసీమ ముద్దుబిడ్డ, మా జగనన్న అంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన ఆ పాట కోట్లాది మంది ప్రజల గుండెలను గెలుచుకుంటే. ఈ ఏడాది 'భళిరా.. భళిభళిరా.. పులివెందుల్లో పుట్టిందా పులిరా' అనే పాట భారీగా వైరల్ అవుతుంది. దీనిని నల్లగొండ గద్దర్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు.
తాజాగా వైఎస్ జగన్ గారిపై గుంతకల్ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి కూతురు నైరుతి రెడ్డి (మున్సిపల్ వైస్ చైర్ పర్సన్) ఒక సాంగ్‌ను పాడారు. 'పేద ప్రజల గుండెల్లొ మా జగనన్నా' అనే పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో లక్షల్లో వ్యూస్ సాధించి దూసుకుపోతుంది.
వైఎస్ జగన్ గారి పాటలే ఎందుకు హిట్ అవుతున్నాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిపై వచ్చిన ప్రతి పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అంతలా ఆయన పాటలను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకే ఎందరో సింగర్స్ ఆయనపై పాటలు పాడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, లోకేశ్‌పై కూడా ఎన్నో పాటలు వచ్చాయి. కానీ ఎక్కువగా సీఎం జగన్ పాటలే ఎక్కువగా హిట్ కావడానికి, లోకేశ్, బాబు పాటలు ఫెయిల్యూర్ కావడానికి తేడా ఏంటంటే.. వాళ్ల జీవితాలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
వైఎస్ జగన్ జీవితంలో కష్టాలే ఎక్కువ ఉన్నాయి.. ఆయన జీవిత కథలో అనేక కోణాలున్నాయి. జగన్ పట్ల ప్రజలు చూపించే శ్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. అదే విధంగా ఆయన చుట్టూ ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయి. ఆపై ఎల్లో మీడియా వేధింపులు, వాటిని తట్టుకుని నిలబడగలిగిన దమ్ము, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగిన మానసిక దృఢత్వంతో పాటు ఎన్ని కష్టాలొచ్చినా లెక్కచేయని మనోధైర్యం సీఎం జగన్‌కు ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చాయి.
ఇదే చంద్రబాబు, లోకేశ్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోని బాబు ముఖ్యమంత్రి అయితే.. లోకేష్ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే తండ్రి కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అలాంటప్పుడు వాళ్ల గురించి ఎవరైన ఏం రాస్తారు..? ఏం పాడుతారు..? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి వచ్చిన కొన్ని పాటలు చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment