comedian PrudhviRaj
-
డర్టీ మైండ్ పృథ్వీ..ఓవరాక్షన్
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..’అని తెలుగు భాషలో ఓ అద్భుతమైన సామెత ఉంది. దాని అర్థం అడ్డగోలుగా దారి తప్పిపోయిన వాళ్లు కూడా నీతులు వల్లించడం అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై సీనీ నటుడు పృథ్వీరాజ్ చేస్తున్న విమర్శలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఆయన ప్రవచించే నీతులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీలో మోసగాళ్లు ఉన్నారని, వారి చరిత్ర తన డైరీలో రాసుకున్నానని.. త్వరలోనే వారి బాగోతాలను బయటపెడతానని..ఏవోవో కారుకూతలు కూస్తున్నాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు పృథ్వీ చేయడం విడ్డూరంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. ‘బాధ్యత గల పదవిలో ఉండి అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన పృథ్వీ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడా?’ అని నవ్వుకుంటున్నారు. బాధ్యత గల పదవిస్తే.. వ్యవస్థకు చెడ్డపేరు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కమెడియన్ పృథ్వీ వైఎస్సార్సీపీ కోసం పని చేశాడు. అయితే ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమి లేదు. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చి పనిచేశాడనే సానుభూతితో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ )చైర్మన్ బాధ్యతల్ని పృథ్వీకి అప్పగించాడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక చానల్ చైర్మన్‌గా ఉంటూ.. ఓ మహిళతో అసభ్యకర సంభాషణ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సీఎం జగన్ వెంటనే అతన్ని సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత సీఎం జగన్‌ని కలిసేందుకు, పార్టీలో పని చేసేందకు విఫల ప్రయత్నం చేశాడు. కానీ అతని పట్ల సీఎం జగన్ విముఖత వ్యక్తం చేశాడు. జగన్ కాదనడంతో చివరకు టీడీపీ, జనసేన మందలోకి చేరిపోయాడు. భార్యను చిత్ర హింసలు పెట్టి.. కమెడియన్ పృథ్వీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. బయట పడింది ఒక్క ఆడియో టేపు మాత్రమే అని.. అంతకు మించిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్న మాట. అతని భార్య ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కింది. 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీరాజ్ వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే సినిమాల్లో బిజీ అయిన తర్వాత భార్య పిల్లల్ని పట్టించుకోలేదు. 2016లో భార్యను ఇంట్లో నుంచి గెంటివేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ‘స్టార్డమ్ వచ్చిన తర్వాత తనను పట్టించుకోవట్లేదని, నోటికొచ్చింది తిడుతూ తనను చిత్ర హింసలు పెట్టాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు.. శ్రీలక్ష్మికి పృథ్వీరాజ్ ప్రతి నెల 8 లక్షల భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. పృథ్వీ.. మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మెప్పు పొందడం కోసం పృథ్వీ నానా తంటాలు పడుతున్నాడు. మొన్న ఏపీ రాజకీయాల ఫలితాలపై చిలుక జోస్యం చెబుతూ.. 2024 ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని చెప్పి కామెడీ చేశాడు. ఇప్పుడేమో తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ వదిలిన బాణమని.. వైఎస్సార్సీపీ బాగోతాలు బయటపెడతానంటూ సినిమాల్లో మాదిరి డైలాగ్స్ చెబుతున్నాడు. అయితే అంతకంటే నీ రాసలీలలకు సంబంధించిన మరిన్ని ఆడియోలు బయటకు రాకుండా చూస్కో అంటూ వైఎస్సారీసీపీ సానుభూతిపరులు చరకలు అంటిస్తున్నారు.అంతేకాదు మహిళా ఉద్యోగులతో ఏం కూతలు కూశావో గుర్తు లేదా పృథ్వీ రాజ్ అంటూ అప్పట్లో లీకైన ఆడియో టేప్‌ని మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఆ ఆడియోలో ఏముంది? మహిళ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణ ఇలా ఉంది.. పృథ్వీ: హాల్లో మహిళ: సార్..హలో పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్? మహిళ: పడుకున్నా అన్నాను సార్ పృథ్వీ: అన్నం తిన్నవా? మహిళ: ఇప్పుడే తిని పడుకున్నా పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా? మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో. పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా? మహిళ: ఎవరు పృథ్వీ : నేను.. మహిళ: వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు? పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా? మహిళ: మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. పృథ్వీ : ఇప్పుడు? మహిళ: ఇప్పుడు కూడా. పృథ్వీ : పడుకునేటప్పుడు? మహిళ: సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు. పృథ్వీ : ఔనా. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా? మహిళ: మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి. పృథ్వీ :ఆగొచ్చు కదా? మహిళ: అందరూ ఉన్నారుగా. పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను. మహిళ: వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా. పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా. మహిళ: తప్పకుండా సార్. పృథ్వీ :నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా. మహిళ: అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో? పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. మహిళ: భలే చెప్తారు ఆ మాట మీరు. పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా. మహిళ: అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు. పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు. మహిళ: ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా? పృథ్వీ :దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు. మహిళ: నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా. మహిళ : ఎప్పుడు? పృథ్వీ :మధ్యాహ్నం మహిళ: ఎక్కడ నుంచి పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా మహిళ: ఆ… వచ్చేశారా కిందకి? పృథ్వీ :వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో… ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను? మహిళ: నేను అరవను కదా. పృథ్వీ : ముందు అరుస్తావు కదా? మహిళ: ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు… నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా. పృథ్వీ : సరే అయితే చెప్పు మహిళ: ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి. పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పృధ్వి
-
చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
సాక్షి, విజయనగరం రూరల్: కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, రాష్ట్రంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీనటుడు ఫృథ్వీ, సిని హీరో కృష్ణుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీకి మద్దతుగా జిల్లా పర్యటనకు వచ్చిన ఫృథ్వీ, కృష్ణుడు, జోగినాయుడు, సినీ, టీవీ ఆర్టిస్టుల బృందం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫృథ్వీ మాట్లాడుతూ జననేత జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు ఐదు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నాడన్నారు. ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహాకూటమి అని తెలంగాణలో పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు చేసుకున్న చంద్రబాబు, రాష్ట్రంలో ఎన్నికల వేళ మాయాకూటమిని కట్టాడన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని గెలిపించాలన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తులన్నారు. జిల్లాలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని సినీ నటుడు కృష్ణుడు అన్నారు. విజయనగరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కోటలో రాణి కావాలో, ఎళ్లవేళలా తోడుండే ప్రజల నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరోయే తప్ప రియల్ హీరో కాదన్నారు. మరో సినీ, టీవీ నటుడు జోగినాయుడు మాట్లాడుతూ కోటల్లో మహారాణులను కాదు మనకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలకు పొడిచిన వెన్నుపోటుపై ఫృథ్వీ, నటులు ఆలపించిన గేయం ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణతేజ, వర్మ, ఈశ్వర్ కౌషిక్, రాంపండు, తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్‌కు మహిళలే అండ నెల్లిమర్ల: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలే అండ అని ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేటలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పృథ్వీరాజ్ తన బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇదిలా ఉంటే వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు కేఏ పాల్ని తీసుకొచ్చి, ప్రజాశాంతి పార్టీ తరఫున ఒకేలాంటి పేరుగల అభ్యర్థులను పోటీకి నిలబెట్టారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ నటులు కృష్ణుడు, జోగినాయుడు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, మండల శాఖ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, కె.హర్షవర్ధన్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ గారంటే నాకు ప్రాణం!
‘‘నేను సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ‘తాడేపల్లిగూడెంలో ఓ పెద్దాయన ఉంటాడు. పిలవండ్రా మంచిగా రెండు డైలాగ్స్ చెబుతాడు’ అని నా గురించి సినిమా యూనిట్ చర్చించుకుంటే నేను విజయం సాధించినట్లే’’ అన్నారు పృథ్వీ. ‘జ్యోతిలక్ష్మి, ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పిళ్లై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన çపృథ్వీ చెప్పిన విశేషాలు. ∙‘ఖడ్గం, లౌక్యం’ సినిమాల్లో నటిస్తున్నప్పుడే ఆ సినిమాలు హిట్ సాధిస్తాయనే నమ్మకం కలిగింది. ఇప్పుడు ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రానికి అదే కలుగుతోంది. ఇందులో ధనశెట్టి అనే క్యారెక్టర్ చేశాను. గోపీ గణేశ్ మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో నా మార్క్ కామెడీ ఉంటుంది. అలాగే నా పాత్రకు ‘గోవింద’ అనే ఊతపదం ఉంటుంది. దేవుడి పేరును అపహాస్యం చేయాలని మాత్రం కాదు. ∙ఈ సినిమాలో హీరో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. తనకు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇంతకుముందు నేను, సత్యదేవ్ ఇద్దరం కలిసి ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మా ఊరి రామాయణం’ చిత్రంలో నటించాం. వచ్చే ఏడాది సత్యను హీరోగా పెట్టి ప్రకాశ్‌రాజ్ ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ∙నేను ఎవరి చేతిలో అయినా మోసపోయానా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విభిన్నమైన అనుభవాలు ఉన్నాయి. ఏదైనా కాలమే నేర్పిస్తుంది. బేసిక్‌గా నేను హాస్యనటుణ్ని కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టుని. ఎక్కువ హాస్యభరితమైన పాత్రలు వచ్చాయంతే. కైకాల సత్యానారాయణ, కోట శ్రీనివాసరావుగార్లు విలన్లుగా, హాస్యనటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అద్భుతంగా రాణించారు. నేను క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడానికి ఇదే సరైన సమయమని వారు నాకు సూచించారు. భవిష్యత్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ నా మార్క్ కామెడీ నా పాత్రలో ఉండేలా జాగ్రత్త వహిస్తాను. ∙ఇండస్ట్రీలో నాకు పెద్దగా గ్యాప్ రాలేదు. ‘వినయవిధేయరామ’లో హీరోయిన్ తండ్రి పాత్రలో, ‘మహర్షి’ సినిమా సెకండాఫ్ సీన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాను. మహానేత వైయస్సార్ బయోపిక్ ‘యాత్ర’లో తెలుగుదేశం ఎమ్మెల్యే పాత్రలో నటించాను. ‘ఎఫ్2’లో చేశాను. బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఓ సినిమాలో కనిపిస్తా. ‘బృందావనమిది అందరిదీ’ సినిమా చేస్తున్నా. ధనుశ్ హీరోగా చేయనున్న ఓ తమిళ సినిమాలో నటించబోతున్నాను. ∙వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారంటే నాకు ప్రాణం. నాకు ఓపిక, ఊపిరి ఉన్నంత కాలం ఆయనతోనే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదనే అనుకుంటున్నాను. రాజకీయాల్లో భవిష్యత్ కార్యాచరణ గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. -
ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్రపై కమెడీయన్ పృధ్వీ క్లారిటీ ఇచ్చారు. తన పాత్రను తగ్గించారన్నది అవాస్తమని ఆయన అన్నారు. ఖైదీ నం.150లో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని పృధ్వీ తెలిపారు. కొన్ని వెబ్ సైట్లు తాను చెప్పిన మాటలను వక్రీకరించాయని, చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాగా పృధ్వీ నటించిన కొన్ని సీన్లు ఎడిటింగ్‌లో కత్తెర పడినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పృధ్వీ తాను నటించిన సీన్లు తొలగించడం దురదృష్టకరమని, సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు పలు వెబ్సైట్లలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ఖైదీ నం.150 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ