
మలయాళ నటుడు పృధ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి ఆయన నిర్మిస్తోన్న సినిమా ‘9’. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఫేమ్ జెన్యూస్ మహ్మద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ కమ్ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృధ్వీరాజ్ నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం కథానాయిక వామికాను తీసుకున్నారు. ఇందులో ‘ఇవ’ అనే మిస్టిరీయస్ క్యారెక్టర్ చేయనున్నారామె. ‘గోధా’ చిత్రం తర్వాత ఆమె మలయాళంలో నటిస్తున్న చిత్రం ఇదే. అన్నట్లు.. ఈ అమ్మడు తెలుగు తెరపై కూడా మెరిశారు. సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘భలే మంచి రోజు’ చిత్రంలో వామికానే కథానాయిక.
Comments
Please login to add a commentAdd a comment