ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా? | Pruthvi Raj Sukumaran Aadujeevitham Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Aadu Jeevitham Trailer: ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా?

Published Sat, Apr 8 2023 9:02 PM | Last Updated on Sat, Apr 8 2023 9:07 PM

Pruthvi Raj Sukumaran Aadujeevitham Movie Trailer Released - Sakshi

జాతీయ అవార్డ్ గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ఆడు జీవితం'. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. మలయాళంలో ఈ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ చూస్తే మారుమూల గ్రామం నుంచి అరబ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడే ఓ యువకుడి కష్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్విరాజ్ జీవించాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అమలాపాల్‌ కథానాయికగా నటిస్తోంది.

జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. బెన్ని డానియల్‌ రాసిన నవల ‘ఆడు జీవితం’ ఆధారంగానే బ్లెస్సీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement