Sukumaran
-
ఎడారి బతుకును తెరపై చూపే చిత్రం.. ట్రైలర్ చూశారా?
జాతీయ అవార్డ్ గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ఆడు జీవితం'. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. మలయాళంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తే మారుమూల గ్రామం నుంచి అరబ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడే ఓ యువకుడి కష్టాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బానిస బతుకు అనుభవిస్తున్న వలస కూలీగా పృథ్విరాజ్ జీవించాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించగా.. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. బెన్ని డానియల్ రాసిన నవల ‘ఆడు జీవితం’ ఆధారంగానే బ్లెస్సీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. -
ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
‘ఒకే ఫ్రేమ్‌లో గొప్ప నటుడిని, గొప్ప తల్లిని చూడడం, దానికి నేను దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది’అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మలయాళ ప్రముఖ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ‘బ్రో డాడీ’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్, మళయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశాడు డైర్టెర్ పృథ్వీరాజ్. దీనికి "చివరికి ఇది జరగడం ఆనందంగా ఉంది" అంటూ పృథ్వీరాజ్ భార్య సుప్రియ కామెంట్ పెట్టారు. (చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో!) కాగా, పృథ్వీరాజ్ తల్లిదండ్రులు లేట్ సుకుమారన్, మల్లిక ఇద్దరు మళయాళ సినీ పరిశ్రమలో గుర్తింపుపొందిన నటీనటులే. అంతేకాకుండా గతంలో మెహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న "బ్రో డాడీ"లో కళ్యాణి ప్రియదర్శన్, మీనా వంటి గుర్తింపు పొందిన నటీనటులతో పాటు పృథ్వీరాజ్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
సుకుమార్ సినిమాలో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఆ ఉత్సాహంతో నిఖిల్ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ - స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో సుకుమార్ అందించిన కథతో సూర్యప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ విజయవంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
అప్పులబాధతో కుటుంబం ఆత్మహత్య
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అప్పులు, రుణదాతల ఒత్తిళ్లు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలూ అనంతలోకాలకు వెళ్లిపోవడం స్థానికంగా కలచి వేసింది. ఈ విషాద సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద చోటు చేసుకుంది. చెన్నై సమీపంలోని పెరంబూరు ప్రాం తానికి చెందిన సుకుమారన్ (45) పెరంబూరులోని రైల్వే గ్యారేజీ వ ర్క్స్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జయంతి (40). కుమార్తె ఆశా(19), కుమారుడు హరీష్ అలియాస్ జగదీష్(15)తో కలిసి వేపంబట్టులో నివాసం ఉంటున్నాడు. భార్య జయంతి గృహిణికాగా, కుమార్తె ఆశా చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, కుమారుడు జగదీష్ సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సుకుమారన్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం రుణదాతలు కొందరు వచ్చి అప్పు చెల్లించాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో సుకుమారన్ మనస్తాపం చెంది నట్టు బంధువులు చెబుతున్నారు. అప్పులు, గొడవలను పెరంబూరులో ఉన్న బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆదివారం జరిగిన గొడవలపై ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయంతి తమకు అప్పుల భారం ఎక్కువగా ఉందని, తమకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని బంధువుల వద్ద రోదించినట్టు తెలుస్తోంది. అప్పులపై కలత చెందవద్దని వారించిన బంధువులు, సోమవారం మాట్లాడుకుందామని నచ్చచెప్పినట్టు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం జయంతి అన్న కొడుకు సతీష్ ఫోన్ చేశాడు. అయితే ఫోన్ తీయలేదు. అనుమానం కలిగిన సతీష్ ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులకు లోపల గడియ పెట్టి ఉండడం చూశాడు. కిటికీ తెరిచి చూడగా సుకుమార్, జయంతి, ఆశా, జగదీష్‌లు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించాడు. సెవ్వాపేట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాలను గడ్డపారతో పగులగొట్టి మృత దేహాలను వెలికితీసి తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. కారణం ఇదేనా! పెరంబూరుకు చెందిన సుకుమారన్ వేపంబట్టులో ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలుకు అప్పలు చేసినట్టు తెలుస్తుంది. అప్పలు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఆత్మహత్యకు గల ప్రధాన కారణంగా పోలీసులు వివరించారు. దీంతో పాటు రైల్వే ఉద్యోగి అయిన సుకుమారన్, అదే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 2లక్షల నుంచి 4 లక్షల వరకు వ సూలు చేసినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. నగదు ఇచ్చిన వారు కొందరు ఆదివారం ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు నిర్ధారించారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.