
‘ఒకే ఫ్రేమ్‌లో గొప్ప నటుడిని, గొప్ప తల్లిని చూడడం, దానికి నేను దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది’అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మలయాళ ప్రముఖ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ‘బ్రో డాడీ’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్, మళయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశాడు డైర్టెర్ పృథ్వీరాజ్. దీనికి "చివరికి ఇది జరగడం ఆనందంగా ఉంది" అంటూ పృథ్వీరాజ్ భార్య సుప్రియ కామెంట్ పెట్టారు.
(చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్‌లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో!)
కాగా, పృథ్వీరాజ్ తల్లిదండ్రులు లేట్ సుకుమారన్, మల్లిక ఇద్దరు మళయాళ సినీ పరిశ్రమలో గుర్తింపుపొందిన నటీనటులే. అంతేకాకుండా గతంలో మెహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న "బ్రో డాడీ"లో కళ్యాణి ప్రియదర్శన్, మీనా వంటి గుర్తింపు పొందిన నటీనటులతో పాటు పృథ్వీరాజ్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment