
ఆస్కార్ అవార్డు సాధించిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం అంతర్జాతీయ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా హాలీవుడ్ సినిమాలతో పాటు స్టేజ్ షోస్ కూడా చేస్తున్న రెహమాన్ డేట్స్ కుదరని కారణంగా పలు చిత్రాలను వదులకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 151వ సినిమా నుంచి కూడా ఈ కారణంగానే తప్పుకున్నాడు రెహమాన్. అయితే త్వరలో ఈ స్వరసంచలనం ఓ మలయాళ సినిమాకు స్వరాలందిస్తున్నాడన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన రెహమాన్ 1992లో తన రెండో సినిమా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన యోధ సినిమాకు సంగీతమందించారు. కానీ తరువాత ఇన్నేళ్లలో ఒక్క మలయాళ సినిమాకు కూడా రెహమాన్ సంగీతమందించలేదు. సరిగ్గా పాతికేళ్ల తరువాత తిరిగి ఓ మలయాళ సినిమాకు రెహమాన్ పనిచేయటం ఆసక్తికరంగా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆడుజీవితమ్ సినిమాకు రెహమాన్ సంగీతమందిచనున్నాడు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. రెహమాన్ స్వరాలందించటం కన్ఫమ్ అన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment