
సాక్షి, భీమవరం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు వైఎస్ జగన్ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్ మంగళవారం జననేతను కలిశారు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
దుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే..
అనంతరం పృథ్వీ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. మండుటెండలను లెక్కచేయకుండా.. వైఎస్ జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే అధికారం. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. వైఎస్ జగన్ జననేత. మాట తిప్పని, మడమ తిప్పని మహాయోధులు ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ మాత్రమే. నేను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరే. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే జగన్‌కు ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్ధమవుతోంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment