
కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై వైఎస్ జగన్‌తో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ప్రసాదరాజు తదితర నేతలు
ఏలూరు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్జీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర పశ్చిమలో పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యిందని, జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌ను అక్కున చేర్చుకుని, అభిమానాన్ని చాటుకున్నారని ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పేర్కొన్నారు. పాదయాత్ర విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు, పార్టీ నేతలు, శ్రేణులకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు చెప్పారు. జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 28 రోజుల పాటు జిల్లాలో జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ వేల సంఖ్యలో జనం పాదయాత్రకు హాజరవుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని నాని పేర్కొన్నారు. కొవ్వూరులో పాదయాత్ర ముగింపునకు అశేష జనవాహిని అద్భుత రీతిలో వీడ్కోలు పలికారన్నారు. జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర సక్సెస్‌తో టీడీపీ నేతల గుండెల్లో గుబులు పట్టుకుందని, రాబోయే కాలంలో జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment