
కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో...
ఏలూరు : హాస్యానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, ప్రతి సినిమా విజయం వెనుక హాస్యానిదే ప్రధాన పాత్ర అని సినీ హాస్య, సహాయ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత స్వామికి, అమ్మవారికి పూజలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని అన్నారు. కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో సినిమాలో హాస్యం కూడా అంతేనన్నారు. ఆలయంలో ఆయనను చూసిన పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.