తెనాలి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ (మా–ఏపీ) అధ్యక్షురాలు, సినీనటి కవిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసినట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా శుక్రవారం తెలిపారు. తెనాలిలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మా–ఏపీ కార్యక్రమాలు, రాష్ట్రంలో సినీపరిశ్రమ అభివృద్ధి తమ కమిటీ ముఖ్యమంత్రితో చర్చించనుందని వివరించారు. కమిటీలో కవితతో పాటు సీనియర్ నటులు నరసింహరాజు, గీతాంజలి, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, సినీ జర్నలిస్ట్ వీరబాబు ఉంటారని వివరించారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీఓను రద్దు చేసి, రాష్ట్రంలో సినిమాలు నిర్మించే సంస్థలకు సబ్సిడీ, జీఎస్టీలో రాష్ట్రం వాటా, వినోదం పన్ను తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు పేర్కొన్నారు.
త్రికోటేశ్వరున్ని దర్శించుకున్న సినీనటుడు పృధ్వి
నరసరావుపేట రూరల్(నరసరావుపేట): కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సినీనటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పృధ్వికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి అశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట సినీనటులు తేజస్విని, పద్మరేఖ, జేసినా, ఆషా, పార్టీ నాయకులు చింతా కిరణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment