
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నాం’’ అని ‘మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘మా–ఏపీ’ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘మా–ఏపీ’ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక నామినేషన్‌లు వేసుకోవచ్చు.
ఈసారి ‘మా–ఏపీ’ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘మా–ఏపీ’లో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందినవారు పోటీ చేయవచ్చు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31 వరకు ఏపీలో షూటింగ్‌లు నిలిపివేశాం. ఎవరైనా షూటింగ్‌లు జరిపితే శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్ వడ్లమూడి, ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment