ఐర్లాండ్‌ ఫాలోఆన్‌... | Ireland follow on after 130 all out against Pakistan | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌ ఫాలోఆన్‌...

Published Mon, May 14 2018 4:25 AM | Last Updated on Mon, May 14 2018 4:25 AM

Ireland follow on after 130 all out against Pakistan - Sakshi

డబ్లిన్‌: పాకిస్తాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఐర్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఫాలోఆన్‌ ఆడుతూ ఐర్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఓపెనర్లు జోయ్స్‌ (39 బ్యాటింగ్‌), పోర్టర్‌ఫీల్డ్‌ (23 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 268/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 310/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. షాదాబ్‌ ఖాన్‌ (55; 7 ఫోర్లు), ఫహీమ్‌ అష్రఫ్‌ (83; 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ముర్టాగ్‌ 4, థాంప్సన్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌ పాక్‌ బౌలర్ల ధాటికి 130 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో అబ్బాస్‌ 4, షాదాబ్‌ ఖాన్‌ 3, అమీర్‌ 2 వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement