
డబ్లిన్: అరంగేట్ర టెస్టులోనే ఐర్లాండ్ ఆకట్టుకుంది. పాకిస్తాన్‌ను వణికించి... ఓ దశలో పరాజయం రుచి చూపించేలా కనిపించింది. అయితే, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (121 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు), బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 59; 8 ఫోర్లు) అడ్డుగోడలా నిలబడి ఐర్లాండ్ జట్టుకు నిరాశ మిగిల్చారు. ఐర్లాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఐదు వికెట్లు కోల్పోయి అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 319/7తో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్ 20 పరుగులు జోడించి 339కు ఆలౌటైంది.
సెంచరీ వీరుడు కెవిన్ ఓబ్రైన్ (118) అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. 160 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఐరిష్ బౌలర్ల ధాటికి పాక్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పేసర్ ముర్టాగ్... కీలక బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ (2), అసద్ షఫీఖ్ (1)లను అవుట్ చేశాడు. హరిస్ సొహైల్ (7)ను రాన్‌కిన్ వెనక్కు పంపాడు. కానీ, ఇమామ్, బాబర్ నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి పాక్‌ను గట్టెక్కించారు. విజయానికి 20 పరుగుల దూరంలో బాబర్, కెప్టెన్ సర్ఫరాజ్ (8) అవుటైనా ఇబ్బంది లేకపోయింది. కెవిన్ ఓబ్రైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment