Actor Abbas Living In NewZealand With His Family - Sakshi
Sakshi News home page

హీరో అబ్బాస్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా!

Published Tue, Jun 1 2021 7:20 PM | Last Updated on Tue, Jun 1 2021 9:53 PM

Hero Abbas Now Living In New Zealand With Family - Sakshi

ఒకప్పడు పరిశ్రమలో అగ్ర నటీనటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు. అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలా ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్‌ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్‌ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు.

తన హెయిర్‌ స్టైల్‌, స్కిన్‌ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్‌ కలల రాకుమారుడిగా మారి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ళ వయసులోనే హీరోగా అడుగుపెట్టి.. 40 ఏళ్లకే నటనకు గుడ్‌బై చెప్పేశాడు అబ్బాస్‌. అలా సినీ పరిశ్రమకు దూరమైన అబ్బాస్‌ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సినిమాలు, మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడ ఉంటున్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి స్పష్టమైన క్లారిటి లేదు. ఇలా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాల్లో దర్శనమిస్తున్నాడు. కొంతకాలంగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న అబ్బాస్‌, ఇప్పుడు పూర్తిగా న్యూజిలాండ్ వాసి అయిపోయాడు.


                                        కూతురు, కొడుకుతో అబ్బాస్‌

కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయిన అబ్బాస్‌ అక్కడ మోటివేషనల్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన మోటివేషనల్ స్పీచ్‌తో చాలా మందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్. అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడం డిప్రెషన్‌కు లోనైన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్వూలో వెల్లడించాడు. ఇక ఆ తర్వాత అస్ట్రేలియాలో పబ్లిక్‌ స్పికర్‌గా కోర్స్‌ తీసుకున్న అతడు యువతకు లైఫ్‌పై స్పీచ్‌లు ఇస్తూ వారిలో స్పూర్తి నింపుతున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్‌కు వెళ్లిన కొత్తలో అతడు పెట్రోల్‌ బంకులో పని చేసినట్లు గతంలోనే చెప్పాడు.


                                           భార్యతో అబ్బాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement