Actor Abbas Latest Interview Highlights - Sakshi
Sakshi News home page

Actor Abbas: ఆత్మహత్య ప్రయత్నం.. ట్రక్‌కి ఎదురునిలబడి!

Published Tue, Jul 18 2023 7:01 PM | Last Updated on Tue, Jul 18 2023 9:09 PM

Actor Abbas Comments Latest Interview - Sakshi

Abbas Latest Interview: అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అదే 90ల్లో పుట్టి, ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్నవాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే 'ప్రేమదేశం' చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. అతడిలా ఉండటానికి ట్రై చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చాడు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు.

గర్ల్‌ఫ్రెండ్ వదిలేయడంతో
'టీనేజ్‌లో నా లైఫ్ అంతా గందరగోళంగా ఉండేది. ఎందుకంటే పదో క్లాస్ ఫెయిలయ్యాను. గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసి పోయింది. జీవితం అయిపోయిందనుకున్నాను. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుందామని ఫిక్సయ్యాను. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే బైక్ పై వస్తున్న వ్యక్తిని చూసి.. పక్కకు తప్పుకొన్నాను. ఎందుకంటే నన్ను ట్రక్ గుద్దేస్తుంది. అతడు దాన్ని ఢీ కొట్టి గాయపడతాడు'

(ఇదీ చదవండి: డేట్‌కి వెళ‍్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్)

బైకర్ వల్ల రియలైజేషన్
'ఈ రియలైజేషన్ వల్ల నేను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నా జీవితం గురించి చెప్పాలంటే ఘోరమైన పరిస్థితుల్లోనే నా గురించి కాకుండా పక్కనోళ్ల గురించి ఆలోచించాను. అదే నేను చనిపోకుండా ఆపింది. మీరు ఎదగాలంటే పక్కనోడికి సహాయం చేయండి కానీ ప్రతిఫలం మాత్రం ఆశించకండి.' అని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.

రీఎంట్రీపై ఆసక్తి
అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్ లో కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని ఇదే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి అబ్బాస్ కి ఎవరైనా దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

(ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement