ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు.
పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకున్నాడు
ఎంతో మంది అవమానించారు
'నేను టాయిలెట్ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్ క్లీనర్ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం.
(ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్)
ఆ యాడ్ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు.
రీ ఎంట్రీ ప్లాన్
న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటన్నారని సమాచారం
Comments
Please login to add a commentAdd a comment