
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టామ్ లాథమ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఔటైన సంగతి తెలిసిందే. కాగా ఒక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ 90ల్లో స్టంప్ అవుట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1991-92లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జాన్ రైట్ 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. కాగా జాన్ రైట్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
దాదాపు 30 ఏళ్ల తర్వాత టామ్ లాథమ్ టీమిండియాతో తొలి టెస్టులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. 282 బంతులెదుర్కొన్న లాథమ్ 10 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ విరామ సమయానికి 122 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ 10, కైల్ జేమీసన్ 8 పరుగులతో ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment