John Wright
-
కోచ్ నన్ను కొట్టాడు.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ సందర్భంగా నాటి భారత హెడ్ కోచ్ జాన్ రైట్ తనను కాలర్ పట్టుకుని, చైర్ పైకి తోసేశాడని బాంబు పేల్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో తొందరగా ఔటవ్వడంతో రైట్ తన పట్ల అమానవీయంగా వ్యవహరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భంలో తనకు పట్టలేని కోపం వచ్చిందని.. ఓ తెల్లోడు మనంపై పెత్తనం చేయడమేంటని జట్టు సభ్యులందరినీ ప్రశ్నించానని.. నాటి టీమ్ మేనేజర్ జోక్యంతో తన కోపం చల్లారిందని ఇటీవల జరిగిన ఓ బుక్ లాంచింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం బయటికి పొక్క కూడదని నాటి భారత బృందం సభ్యులు సచిన్‌కు మాట ఇచ్చారని, అందుకే ఎవరికీ తెలియ లేదని అన్నాడు. ఇలాంటి ఘటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగితే పెద్ద రాద్దాంతం అవుతుందని, ఓ విదేశీ కోచ్ అలా చేస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. కాగా, నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఫైనల్లో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) వీరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించారు. కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టాక నాటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సెలబ్రేషన్స్ ఎప్పటికీ భారత అభిమానులు కళ్ల ముందే మెదులుతూ ఉంటుంది. -
రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత..
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టామ్ లాథమ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఔటైన సంగతి తెలిసిందే. కాగా ఒక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ 90ల్లో స్టంప్ అవుట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1991-92లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జాన్ రైట్ 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. కాగా జాన్ రైట్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల తర్వాత టామ్ లాథమ్ టీమిండియాతో తొలి టెస్టులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. 282 బంతులెదుర్కొన్న లాథమ్ 10 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ విరామ సమయానికి 122 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ 10, కైల్ జేమీసన్ 8 పరుగులతో ఆడుతున్నారు. -
అతడు కోచ్ మాత్రమే కాదు.. అంతకుమించి
నాటింగ్‌హామ్: టీమిండియా మాజీ కోచ్ జాన్‌రైట్‌పై మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. జాన్‌రైట్ తనకు ఇష్టమైన కోచ్.. అంతకంటే ఎక్కువగా మంచి స్నేహితుడని పేర్కొన్నాడు. ప్రస్తు తం వరల్డ్‌కప్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గంగూలీ గురువారం భారత్, న్యూజిలాండ్ మధ్య రద్దైన మ్యాచ్‌లో కాసేపు జాన్‌రైట్‌తో కలసి తన అనుభవాలను పంచుకున్నాడు. ఆ వీడియోను శుక్రవారం ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ‘2000వ సంవత్సరంలో జాన్‌రైట్‌ను తొలిసారి కెంట్(ఇంగ్లండ్)లో చూశాను. అతన్ని నాకు ద్రవిడ్ పరిచయం చేశాడు. జాన్‌రైట్‌తో పనిచేయడాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను అని అప్పుడే ద్రవిడ్‌కు చెప్పా. అన్నట్లే మా మధ్య కోచ్, ఆటగాడిలా కాకుండా ఒక మంచి స్నేహబంధం ఏర్పడింది. నిజం చెప్పాలంటే అతనకు నాకు కోచ్‌గా కన్నా స్నేహితుడిగానే ఎక్కువ చేరువ. మేమిద్దరం ఆట పరంగా ఒకర్నొకరం చాలా బాగా అర్థం చేసుకున్నాం. అతడు నాకు నమ్మకమైన, నిజమైన స్నేహితుడు’అని ఆ వీడియోలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా, న్యూజిలాండ్‌కు చెందిన జాన్‌రైట్ భారత జట్టుకు తొలి విదేశీ కోచ్. 2000–2005 మధ్య ఐదేళ్ల పాటు అతను కోచ్‌గా పనిచేశాడు. జాన్ రైట్ శిక్షణలోనే భారత్ 2003 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. 2002 నాట్‌వెస్ట్ సిరీ స్ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్‌ను డ్రాగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకుంది. -
ముంబై ఇండియన్స్ కే విజయావకాశాలు: జాన్ రైట్
ముంబై ఇండియన్స్ జట్టుకు ఫిరోజ్ షా కోట్లా మైదానం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆ జట్టు కోచ్ జాన్ రైట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిండం ఆజట్టుకు అనుకూలంగా మారగా.. రాజస్థాన్ తన స్వంత మైదానం జైపూర్ లోనే అన్ని మ్యాచ్ ఆడటం కొంత ప్రతికూలంగా మారే అవకాశ ఉందని రైట్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 50 వేల పరుగులు పూర్తి చేసుకోవడంపై రైట్ ప్రశంసలు కురిపించారు. శనివారం ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ ఫిట్ ను సాధించారు. క్రికెట్ లెజెండ్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ లకు చివరి మ్యాచ్ కావడంతో ఫైనల్ మ్యాచ్ కు ప్రాధాన్యత పెరిగింది.