ముంబై ఇండియన్స్ కే విజయావకాశాలు: జాన్ రైట్
Published Sun, Oct 6 2013 3:46 PM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
ముంబై ఇండియన్స్ జట్టుకు ఫిరోజ్ షా కోట్లా మైదానం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆ జట్టు కోచ్ జాన్ రైట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిండం ఆజట్టుకు అనుకూలంగా మారగా.. రాజస్థాన్ తన స్వంత మైదానం జైపూర్ లోనే అన్ని మ్యాచ్ ఆడటం కొంత ప్రతికూలంగా మారే అవకాశ ఉందని రైట్ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ 50 వేల పరుగులు పూర్తి చేసుకోవడంపై రైట్ ప్రశంసలు కురిపించారు. శనివారం ట్రినిడాడ్ అండ్ టొబాగోతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ ఫిట్ ను సాధించారు. క్రికెట్ లెజెండ్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ లకు చివరి మ్యాచ్ కావడంతో ఫైనల్ మ్యాచ్ కు ప్రాధాన్యత పెరిగింది.
Advertisement
Advertisement